Jeevitha files defamation suit on Sandhya సంధ్యపై.. పోలీసులకు పిర్యాదు చేసిన జీవిత

Jeevitha rajashekar complaints on sandhya for allegations

Jeevitha Rajashekar, Jeevitha, Rajashekar, broker, police complaint, sandhya, social activist sandhy, casting couch, tollywood, entertainment, movies

Actress turned politician Jeevitha Rajashekar today complaints on social activist sandya for making baseless, untruthy allegation on her, and her family.

మహిళా సంఘం నేత సంధ్యపై.. పోలీసులకు పిర్యాదు చేసిన జీవిత

Posted: 04/17/2018 09:01 PM IST
Jeevitha rajashekar complaints on sandhya for allegations

టాలీవుడ్ లో కాస్టింగ్‌ కౌచ్‌ అంశంపై చర్చ సందర్భ:గా తన భర్త పట్ల, తన పట్లు జుగుప్సాకరమైన అరోపణలు చేసిన మహిళా సంఘం నేత సంధ్యపై టాలీవుడ్ నటి, నిర్మాత జీవితా రాజశేఖర్ జూబ్లీహిల్స్ పోలిస్ స్టెషన్ లో పిర్యాదు చేశారు. అమీర్‌పేటలో లేడీస్ హాస్టల్‌లోని అమ్మాయిలను తాను రాజశేఖర్‌ వద్దకు పంపుతున్నానని.. తాను బ్రోకర్ గా వ్యవహరిస్తున్నానని, తన భర్త అమ్మాయిల పిచ్చోడని అరోపించిన క్రమంలో సంద్యపై అమె ఈ చర్యలు తీసుకున్నారు. అంతకుముందు నిర్వహించిన సమావేశంలో జీవిత రాజశేఖర్ మాట్లాడుతూ.. కాస్టింగ్ కౌచ్ పై చర్చ అసహ్యంగా మారిందని అన్నారు.

ఈ చర్చాగోష్టికి తనను మాట్లాడడానికి రమ్మని పిలిచినా వెళ్లలేదని అమె అన్నారు. అసలు ఎవరికి ఏం కావాలని ఫైట్‌ జరుగుతోందని ఆమె ప్రశ్నించారు. కొన్ని రోజుల ముందు తాను మహాటీవీలో వచ్చిన ఓ వీడియో క్లిప్‌ చూశానని, సామాజిక కార్యకర్త సంధ్య ఛానెల్‌తో మాట్లాడుతూ తనపై నీచమైన ఆరోపణలు చేశారని అన్నారు. సంధ్య మహిళల సంఘం నేతగా వ్యవహరిస్తూ మరో మహిళ గురించి అత్యంత నీచంగా ఎలా అరోపణలు గుప్పిస్తుందని అమె ప్రశ్నించారు. తాను హాస్టల్‌ నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి రాజశేఖర్‌ వద్దకు పంపుతున్నానని ఆమె అందని, మహాన్యూస్‌లో మూర్తి అనే ఎడిటర్‌ ఆ చర్చ జరిపేసి, దానినే కంక్లూజన్ గా చేసి ముగించారని అమె అవేదన వ్యక్తం చేశారు.

మీరు ఏదైనా మాట్లాడుకోండి. ఏ చర్చలకైనా వెళ్లండి కానీ తన గురించి, తన భర్త గురించి, తన కుటుంబం గురించి ఎందుకు మాట్లాడుతున్నారని అమె ప్రశ్నించారు. తనకు కూడా ఇద్దరు కూతుళ్లు వున్నారన్న విషయం సంథ్య మర్చిపోతున్నారని..  రాజశేఖర్‌ కుటుంబం అంటే ఐఏఎస్‌, ఐపీఎస్‌ల కుటుంబమన్నారు. మాపై వేసిన ఆ ఆరోపణలను రుజువు చేయాల్సిందే. ఏ ఆధారాలతో ఇలా మాట్లాడుతున్నారో ప్రజలు కూడా ఆలోచించాలి. సంధ్యకు సెలబ్రిటీలంటే అసలు ఇష్టం లేదన్న భావన కనిపిస్తుందని విమర్శించారు.

సెలబ్రిటీల గురించి ఎన్నో సార్లు సంధ్య ఇటువంటి వ్యాఖ్యలు చేసింది, సినిమా వాళ్లంటేనే ఆమె ఛీప్‌గా వ్యాఖ్యలు చేస్తున్నారు.. తమాషాగా ఉందా, మమ్మల్ని చూస్తే? మా కుటుంబంపై చేసిన అరోపణలకు పరువు నష్టం దావా వేస్తానని అన్నారు. టీవీల్లో డిబేట్లు పెట్టి సెలబ్రిటీల గురించి మాట్లాడితే తాను ఇక ఊరుకోనని జీవిత రాజశేఖర్‌ వార్నింగ్‌ ఇచ్చారు. . 'ఎవ్వరూ అడగరనుకుంటున్నారా? మిమ్మల్ని అడిగేవారు ఎవ్వరూ లేరనా? పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఇక్కడ ఎవ్వరూ చూస్తూ ఊరుకోరు.. చేతులకి గాజులు తొడుక్కుని కూర్చోలేదని మీడియాను కూడా హెచ్చరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles