Bharat Ane Nenu Movie Vachaadayyo Saami Song released మహేష్ ‘వచ్చాడయ్యో సామి’ పాట విన్నారా.?

Bharat ane nenu makers release lyrical video of 3rd song vachaadayyo saami

Mahesh Babu, bharath ane nenu movie, koratala siva, Vachaadayyo Saami lyrical video, DeviSri Prasad, Ramajogaiah shastri, tollywood, entertainment news

The Bharat Ane Nenu is one of the biggest upcoming releases in Tollywood, which will see Mahesh’s playing the role of a Chief Minister for the first time in his career. The film unit released the 3rd song from the movie Vachaadayyo Saami today.

‘‘భరత్ అను నేను’’ నుంచి వచ్చాడయ్యో సామి పాట విన్నారా.?

Posted: 04/05/2018 07:48 PM IST
Bharat ane nenu makers release lyrical video of 3rd song vachaadayyo saami

కొరటాల శివ దర్శకత్వంలో 'భరత్ అనే నేను' సినిమా షూటింగు పార్టును పూర్తి చేసుకుని పోస్టు ప్రోడక్షన్ పనులను కూడా ముగింపు చేసుకునే దిశగా చేరుకుంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే రెండు పాటలను విడదల చేసిన నిర్మాణ సంస్థ ఇవాళ మరో సాంగ్ ను రిలీజ్ చేశారు. ఇదివరకే భరత్‌ అనే నేను టైటిల్‌ సాంగ్‌, 'ఐ డోంట్‌ నో' పాటలను విడుదల చేయగా, మూడవ పాట 'వచ్చాడయ్యో సామి'ని కొంతసేపటి సోషల్ మీడియాలో విడుదల చేశారు. 'వచ్చాడయ్యో సామి .. నింగి సుక్కల్తో గొడుగెత్తింది భూమి ..', ఇచ్చాడయ్యో సామి .. కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ' అంటూ ఈ పాట మొదలవుతోంది.

మహేశ్ ను ఉద్దేశిస్తూ జనం పాడుకునే పాటగా అనిపిస్తోంది. ఆ జనంలో ఒకడై మహేశ్ కూడా చిందేస్తాడనే విషయం పోస్టర్స్ ద్వారా అర్థమవుతోంది. రామజోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యం బాగుంది .. జనంలోకి వెళ్లేలా .. జనం నాల్కులపై ఆడేలా వుంది. ఇక దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఈ పాటకి మరింత ఊపును తీసుకొచ్చిందనే చెప్పాలి. కష్టంలోని సుఖాన్ని .. కలిసి బతకడంలోని ఆనందాన్ని ఆవిష్కరించేలా వున్న ఈ పాటకి నూటికి నూరు మార్కులు పడిపోతాయని చెప్పొచ్చు. ఇక ఈ చిత్రం ఈ నెల 20న తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles