Ram Charan film beats Sarainodu's lifetime record కలెక్షన్లలో రంగస్థలం రఫ్పాడిచేస్తుంది.. ఇక రికార్డులే..

Rangasthalam box office collection ram charan film beats sarainodu s lifetime record

Tollywood,Rangasthalam,Rangasthalam box office collection,Rangasthalam 7 days collection,Rangasthalam total worldwide collection,Ram charan,Rangasthalam first week collection,Rangasthalam beats Sarainodu lifetime record,All time highest grossing film,Director Sukumar,Allu arjun

Ram Charan's Rangasthalam made a superb collection at the worldwide box office in the first week and became the ninth all-time highest grossing Telugu film, beating the lifetime record of Allu Arjun's Sarrainodu.

కలెక్షన్లలో రంగస్థలం రఫ్పాడిచేస్తుంది.. ఇక రికార్డులే..

Posted: 04/06/2018 07:12 PM IST
Rangasthalam box office collection ram charan film beats sarainodu s lifetime record

మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్.. సమంత జంటగా నటించిన చిత్రం రంగస్థలం టాలీవుడ్ టాప్ వసూళ్లు రాబట్టిన చిత్రాలలో ఒకటిగా నిలించింది. సుకుమార్ దర్శకత్వంలో రూపోందించబడిన ఈ చిత్రం పాతకాలం నాటి చిత్రం తరహాలో నాటి గ్రామీణ వాతావరణాలు ఎలా వుండేవన్న వాస్తవాలను నేటి యువతకు అర్థమయ్యేలా చూపించడంలో దర్శకుడు నూటికి నూరు మార్కులు వేసుకున్నారు. ఇక చిత్రంలో చిట్టిబాబుగా తన ఇమేజ్ కాకుండా కేవలం తన క్యారెక్టర్ డిమాండ్ చేసినట్లుగా అద్భుతంగా నటించడంతో అభిమానులు చిత్రాన్ని బాక్సాఫీసు టాప్ హిట్ చిత్రాలలో ఒకటిగా నిలబెట్టారు.

దీంతో ఈ చిత్రం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లైఫ్ టైం హిట్ చిత్రం సరైనోడు వసూళ్లను వెనక్కు నెట్టి మరి ముందుకు సాగిపోతుంది. నెల 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా, ప్రతి ప్రాంతంలోను భారీ వసూళ్లను సాధిస్తూ దూసుకుపోతోంది. విడుదలైన 4 రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల గ్రాస్ ను సాధించి అందరిచే ఔరా! అనిపించింది. వారం రోజులు పూర్తయ్యేనాటికి ప్రపంచవ్యాప్తంగా 130 కోట్ల గ్రాస్ ను దాటేసింది. తెలుగురాష్ట్రాలలో ఏకంగా 95శాతం మేర డిస్ట్రిబ్యూటర్ షేర్ వసూలు చేసి.. 81.27 గ్రాస్ ను రాబట్టినట్టు సమాచారం.

ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ ను 80 కోట్లకు అమ్మారు. వారం రోజుల వసూళ్లు ఈ మార్క్ దాటిపోవడంతో, ఇకపై వచ్చేవన్నీ లాభాలేనని అంటున్నారు. దగ్గర్లో చెప్పుకోదగిన సినిమాలేవీ లేకపోవడంతో భారీ లాభాలు ఖాయమని చెబుతున్నారు. ఇదే జోరు కొనసాగితే, టాలీవుడ్లో ఆల్ టైమ్ గ్రాస్ కలెక్షన్ల లిస్టులో వున్న 'శ్రీమంతుడు' .. 'జనతా గ్యారేజ్' .. 'అత్తారింటికి దారేది' .. 'జై లవకుశ'లను అధిగమించడం ఖాయమనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles