బాహుబలి కాదు.. ఖైదీయే అసలు బిగ్ ఛాలెంజ్ | Katamarayudu should collect khaidi collections.

Big challenge for pawan katamarayudu

Khaidi No 150 Katamarayudu, Katamarayudu Pre Release Business, Katamarayudu Baahubali, Baahubali Pre release business, Katamarayudu Baahubali Business, Baahubali Katamarayudu Khaidi No 150, Katamarayudu Teaser, Pawan Kalyan Katamarayudu Teaser

Powerstar Pawan Kalyan’s Katamarayudu which has so far been under radar due to lack of hype is beginning to show its might. And here is the first sign. Katamarayudu has begun the chase of crossing Megastar Chiranjeevi’s Mega comeback film Khaidi No 150. Right now it is all about pre release business.

కాటమరాయుడు రికార్డు ప్రిరిలీజ్ బిజినెస్.. కలెక్షన్లు కుమ్మాల్సిందే...

Posted: 02/03/2017 03:47 PM IST
Big challenge for pawan katamarayudu

కాటమరాయుడిగా పవన్ కళ్యాణ్ కు ఇప్పుడు బోలెడన్నీ బాధ్యతలు వచ్చిపడ్డాయి. అల్రెడీ సర్దార్ గబ్బర్ సింగ్ తో బయ్యర్లకు తీవ్ర నష్టాన్ని మిగిల్చిన విషయం తెలిసిందే. ఆ నష్టాలను భర్తీ చేయాలంటే బాక్సాఫీస్ వద్ద పవర్ స్టార్ సత్తా చాటాల్సిందే. పైగా రీఎంట్రీ ఖైదీతో అన్నయ్య వంద కోట్ల కలెక్షన్లు రాబట్టిన నేపథ్యంలో ఇది మరీ తప్పనిసరి అయ్యింది.

ఇప్పటికే టాకీ పార్ట్ ఆల్ మోస్ట్ కంప్లీట్ కాగా, రాజకీయాలతో మళ్లీ బిజీ అయిపోయే సరికి చిన్నపాటి కలవరపాటుకు అభిమానులు గురవుతున్నారు. ఎటోచ్చి ఉగాది కానుకగా సినిమాను రిలీజ్ చేయాల్సిందే. ఎందుకంటే ఆ తర్వాత రెండు వారాల నుంచి పెద్ద సినిమాల సందడి ప్రారంభం అవుతుంది కాబట్టి. పైగా ఏప్రిల్ చివరి వారంలో బాహుబలి-2 లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఉంది. ఈ నేపథ్యంలో టైంకి షూటింగ్ పూర్తిచేయాలన్న గట్టిపట్టుదలతో టీం మొత్తం నిరంతరాయంగా షూటింగ్ లో పాల్గొంటోంది.

ఇక కాటమరాయుడిలో పవన్ రాయలసీమ యాసలో సందడి చేయబోతున్నాడంట. ఫ్యాన్స్ కి ఇది మాంచి కిక్కు ఇస్తుందని మేకర్లు చెబుతున్నారు. ప్రీరిలీజ్ బిజినెస్... కూడా రికార్డు స్థాయిలోనే జరిగిందని సమాచారం. బాహుబలి రికార్డులను బద్ధలుకొడుతూ ఆల్ మోస్ట్ ఖైదీ చేసిన బిజినెస్ నే కాటమరాయుడు కూడా చేసిందంట.సీడెడ్ లో మాత్రం ఖైదీని క్రాస్ చేసి మరీ 12 కోట్లకు అమ్ముడు పోయిన విషయం తెలిసిందే. మరి పవన్ ఆ రికార్డులను నెలకొల్పుతాడో లేదో తెలియాలంటే కొంత కాలం ఆగాల్సిందే.  ప్రస్తుతం వైజాగ్ లో షూటింగ్ షెడ్యూల్ జరుపుకుంటోంది. రేపు అంటే ఫిబ్రవరి 4న సాయంత్రం 4 గంటలకు టీజర్ ను రిలీజ్ చేస్తామని ఇప్పటికే మేకర్లు ప్రకటించారు కూడా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Pawan Kalyan  Katamarayudu  Pre release business  Khaidi No 150  

Other Articles