ఇంట్రెస్టింగ్: బెడ్ మీద ఉన్న దాసరి పేపర్ లో చిరుకు ఏం రాసిచ్చాడు | Dasari happy over Khaidi Collections.

Chiranjeevi visits dasari narayana rao

Chiranjeevi Visits Dasari Narayana Rao, Chiranjeevi About Dasari Health, Chiranjeevi Dasari Narayana Rao, Dasari Meesam, Dasari Narayana Rao Khaidi No 150 Collections, Chiru about Dasari Health, Dasari Health Condition, Dasari Narayana Rao, Dasari, Chiranjeevi visit Dasari, Meesam Maelesina Dasari

Chiranjeevi Visits Dasari Narayana Rao at KIMS Hospital. Interesting Conversation between Mega Star and Dasari. Khaidi Collections Meesam Maelesina Dasari. Chiru Explained to Media.

ఖైదీ కలెక్షన్లపై దాసరి ఫుల్ ఖుషీ

Posted: 02/03/2017 04:20 PM IST
Chiranjeevi visits dasari narayana rao

కిమ్స్ ఆసుపత్రిలో గత మూడు రోజులుగా తీవ్ర అనారోగ్యంతో లెజెండరీ దర్శకుడు దాసరి నారాయణరావు చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన పూర్తి మానసిక ఆరోగ్యాన్ని సంతరించుకున్నారని అంటున్నాడు మెగాస్టార్ చిరంజీవి. ఐసీయూలో బెడ్ మీద ఉన్న దాసరి తనను చూడగానే ఆప్యాయంగా రిసీవ్ చేసుకున్నాడని, మాట్లాడలేకపోయినప్పటికీ, తాను చెప్పాలనుకున్నది పేపర్ మీద రాసి చూపించాడని చిరు తెలిపాడు.

త్వరలో 'ఖైదీ నెంబర్ 150 సినిమా ధ్యాంక్స్ గివింగ్ ఫంక్షన్ నిర్వహించాలనుకుంటున్నాము... మీ ఆశీస్సులు కావాల'ని కోరగానే.. ఆయన సంతోషం వ్యక్తం చేశారని చెప్పారు. అంతే కాకుండా తనకు అభినందనలు చెప్పారని, సినిమా ఎలా ఆడుతోందో అడిగి తెలుసుకున్నాడు. 150 కోట్లు వసూలు చేసిందని చెప్పగానే, 250 కోట్లు వసూలు చేయాలని రాశాడని, ఖైదీ షేర్ ఇంత అని చెప్పగానే మీసం మెలేశాడని, అదీ ఎప్పటికీ మరిచిపోలేనని చిరు భావోద్వేగంతో మీడియాకు వివరించాడు. 

అంతేకాదు త్వరగా కోలుకొని ఫంక్షన్ కు వచ్చి మాట్లాడుతానని అన్నారని తెలిపాడు. మరో రెండు రోజుల్లో ఆయన పూర్తి శారీరక ఆరోగ్యం సంతరించుకుని ఇంటికి తిరిగి వస్తారని ఆశిస్తున్నానని చిరంజీవి చెప్పాడు. కాగా, నేడు దాసరిని సందర్శించిన వారిలో ప్రముఖ నటి జయప్రద, దర్శకుడు వీవీ వినాయక్, వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు, నిర్మాతలు అల్లు అరవింద్, సి.కల్యాణ్ తదితరులు ఉన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dasari Narayana Rao  Health  Chiranjeevi  Khaidi No 150 Collections  

Other Articles