హీరో సునీల్ కి కాస్ట్ లీ కారు గిఫ్ట్... ఎవరిచ్చారంటే... | Hero Sunil New Car with Fancy Number.

Sunil gifts new car to himself

Hero Sunil, Sunil Skoda Laurin Car, Hero Sunil RTA office, Sunil New Car, Hero Sunil 2017, Sunil upcoming Movies, Sunil Fancy Number Car, Hero Sunil Fancy Number

Tollywood Hero Sunil has gifted a car for himself. Sunil was spotted at Malakpet East Zone RTA office in Musarambag for the registration of his new vehicle. Sunil has brought white colour Skoda Laurin.

సునీల్ కాస్టిలీ కారు కహానీ

Posted: 01/24/2017 01:34 PM IST
Sunil gifts new car to himself

టాలీవుడ్ హీరో సునీల్ కు 2016 ఏడాది పెద్దగా కలిసి రాలేకపోయినా పెద్దగా డ్యామేజ్ చేయకపోవటంతో సినిమాలు చేసేందుకు కొందరు నిర్మాతలు ముందుకు వస్తూనే ఉన్నారు. ప్రస్తుతం క్రాంతి మాధవ్ ఉంగరాల రాంబాబు, మళయాళం హిట్ మూవీ టూకంట్రీ రీమేక్ లో నటిస్తున్నాడు. ఇవి గాక మరో రెండు చిత్రాలు స్టోరీ డిస్కషన్ లో ఉన్నాయంట.

ఇదిలా ఉంటే సునీల్ ఓ లగ్జరీ కారు గిప్ట్ వచ్చిందంట. వైట్ కలర్ స్కోడా లారిన్ కారు ధర అక్షరాల ముప్పై ఒక్క లక్షల డెబ్బై మూడు వేలు. ఇక దీని రిజిస్ట్రేషన్ కోసం మలక్ పేట్ లోని ఆర్టీఐ ఆఫీస్ కు వెళ్లిన సునీల్ టీఎస్11 ఈజే 2345 ఫ్యాన్సీ నంబర్ ను కేటాయించారు. ఈ ఫ్యాన్సీ నంబర్ కోసం పదివేలు డీడీ చెల్లించి దగ్గరుండి మరీ రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు సునీల్.

ఆపై తన మోటర్ వెహికిల్ ఇన్ స్పెక్టర్ కు థాంక్స్ చెబుతూ తన కొత్తకారుతో ఓ ఫోటో దిగి అప్ లోడ్ చేశాడు. అవును... ఇంతకీ ఈ కాస్ట్ లీ కారు సునీల్ కు ఎవరు గిఫ్ట్ ఇచ్చారనేగా.. సునీల్ తనకు తానుగానే ఇచ్చుకున్నాడటలేండి.

గతేడాది కృష్ణాష్టమి.. ఈడు గోల్డ్ ఎహె.. జక్కన్న సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సునీల్.. ఒక్క మూవీతో కూడా ఆడియన్స్ ను ఆకట్టుకోలేకపోయాడు. కనీసం ఈ యేడాదైనా ఈ పూలరంగడికి సక్సెస్ ఇవ్వాలని ఆల్ ది బెస్ట్ చెబుదాం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tollywwod  Hero Sunil  Costly Car  Skoda Laurin  

Other Articles