కంచుకోటలో బాలయ్యకు పెద్ద దెబ్బ | Gautamiputra Satakarni low collections in Ceded.

Gautamiputra satakarni collections in ceded area

Gautamiputra Satakarni, Satakarni Ceded Collections, Satakarni Collections, Bala Krishna Ceded Collections, Balayya Ceded market, Gautamiputra Satakarni Collections

Bala Krishna's movies have a very good market in ceded area compared to other regions. But Gautamiputra Satakarni breaks the trend. Compare to Khaidi No 150 Satakarni gets low collections.

బాలయ్య ట్రెండ్ టోటల్ రివర్స్ అయ్యింది

Posted: 01/24/2017 02:43 PM IST
Gautamiputra satakarni collections in ceded area

సంక్రాంతి బరిలో దిగిన బాలయ్య వందో చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి దిగ్విజయంగా దూసుకుపోతుంది. ఇప్పటికే సేఫ్ సైడ్ ప్రాజెక్టుగా మారిపోయిన శాతకర్ణి కొన్ని ఏరియాలలో లాభల పంటను కూడా పండించేసింది. అయితే నందమూరి కంచుకోటగా ఉన్న సీడెడ్ లోనే దీనికి దెబ్బడిపోవటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

సాధారణంగా బాలయ్య సినిమా సీడెడ్ లో రిలీజ్ అయ్యిందంటే కలెక్షన్ల సునామీ కురుస్తుంది. ఫ్లాఫ్ సినిమాలతో కూడా భారీ కలెక్షన్లు రాబట్టిన క్రెడిట్ ఇక్కడ ఉంది. అలాంటిది శాతకర్ణి విషయంలో మాత్రం సీన్ రివర్స్ అయ్యింది. వైజాగ్ తోపాటు మిగతా అర్బన్ ఏరియాల్లో రికార్డు కలెక్షన్లు సాధిస్తున్నప్పటికీ, మిగతా ప్రాంతాల్లో మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయి. అలాగని నష్టాలను మాత్రం మిగిల్చే పరిస్థితులు లేవని డిస్ట్రిబ్యూటర్ లు చెబుతున్నారు.

దీనికి కారణం కూడా లేకపోలేదు బాలయ్య మాస్ మార్క్ మిస్ కావటం, చారిత్రక నేపథ్యం, పైగా కంచె తీసిన క్లాసిక్ దర్శకుడు కావటంతోనే మల్టీఫ్లెక్స్ ఆడియన్స్ ఆదరణ ఎక్కువగా ఉందని తెలుస్తోంది. ఓవరాల్ గా లాంగ్ రన్ లో ఈ ఏరియాలో తక్కువ లాభాలతోనే శాతకర్ణి బిజినెస్ క్లోజ్ అయ్యేలా కనిపిస్తోంది. ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. పదేళ్ల తర్వాత వెండితెరపై సందడి చేసిన మెగాస్టార్ చిత్రం, పోటీగా రిలీజ్ అయిన ఖైదీ నంబర్ 150 భారీగా కలెక్షన్లు రాబడుతుండటం విశేషం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Gautamiputra Satakarni  Ceded  Collections  

Other Articles