మహేష్-చెర్రీ ఆ పని చేయబోతున్నారా? నిజమా? రూమరా? | Mahesh And Charan become businessmen. .

Ram charan and mahesh babu to become business partners

Ram Charan, Mahesh Babu, Ram Charan and Mahesh Babu, Tollywood Business Partners, Mahesh team up Charan, Cherry and Mahesh business, Mahesh And Charan New Business Partners, Ram Charan Hotel Business, Mahesh Babu Business, Ram Charan Business

Ram Charan and Mahesh Babu are going to become business partner and they are planning to venture into hotel business. Charan wants to establish a hotel chains in India and Mahesh will be a partner in it. It may turn to be a huge venture.

మహేష్-చెర్రీలు కలిసి ఏం చేయబోతున్నారంటే...

Posted: 01/24/2017 12:41 PM IST
Ram charan and mahesh babu to become business partners

టాలీవుడ్ లో ఈ మధ్య ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. సాధారణంగా ఇద్దరు హీరోల మధ్య పోటీ ఉన్న సమయంలో అభిమానులు ఎంతలా చెలరేగిపోతారో తెలీయంది కాదు. అలాంటి వాళ్లలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, మెగా పవర్ స్టార్ రాంచరణ్ లు కూడా ఉన్నారు. ఇద్దరి సినిమాలు ఒకే సీజన్ లో రిలీజ్ అయ్యి తలపడిన దాఖలాలు ఉన్నాయి. కానీ, కొంత కాలంగా వాళ్ల స్నేహం టాలీవుడ్ లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

క్రిస్మస్ హాలీడేస్ రెండు ఫ్యామిలీలు ఒకే చోట జరుపుకోవటం, ఆపై నమత్రా 45వ పుట్టినరోజు సెలబ్రేషన్ లో వీళ్లంతా సందడి చేయటం, మరీ ముఖ్యంగా ఈ ఇద్దరు స్టార్ హీరోలు, వాళ్ల వాళ్ల భార్యలు కూడా ఒకరితో ఒకరు చాలా క్లోజ్ గా మూవ్ కావటంతో అభిమానుల్లో సందడి నెలకొంది. ఇదిలా ఉండగానే వీరిద్దరి కాంబినేషన్ లో త్వరలోనే ఓ కొత్త ప్రాజెక్టు ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది.

అయితే అది సినిమా కోసం కాదులేండి. ఇద్దరు కలిసి వ్యాపారం చేయబోతున్నాడని సమాచారం. ఇప్పటికే ట్రూజెట్ ఎయిర్ లైన్స్ ఉన్న చెర్రీ త్వరలో ఓ హోటల్స్ బిజినెస్ ప్రారంభించబోతున్నాడంట. ఇందులో మహేష్ కూడ భాగస్వామిగా మారబోతున్నట్లు తెలుస్తోంది. అదే నిజమైతే టాలీవుడ్ లో నాగ్-చిరు తర్వాత బిజినెస్ ఫ్రెండ్స్ గా మహేష్-చెర్రీల కాంబినేషన్ నిలవబోతుంది. పరిణామాలన్నీ చూస్తుంటే ప్యూచర్ లో కొణిదెల బ్యానర్ లో మహేష్ సినిమా తీసిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదేమో!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles