లింగుస్వామి సినిమా ఎన్ని ట్విస్ట్ లో... | Allu Arjun announces his Tamil debut film to begin next year

Allu arjun announces his tamil debut film to begin next year

Allu Arjun announces his Tamil debut, Allu Arjun Linguswamy ofiicially announced, Allu Arjun Linguswamy movie, Bunny Linguswamy Movie, Bunny Linguswamy Movie producer, Allu Arjun Linguswamy Movie producer, Allu Arjun Linguswamy movie officially announced, Allu Arjun Linguswamy movie pressmeet

Allu Arjun announces his Tamil debut film under Linguswamy direction to begin next year.

బన్నీ బై‘లింగు’వల్ అబ్బో పెద్ద స్టోరీనే...

Posted: 09/22/2016 05:30 PM IST
Allu arjun announces his tamil debut film to begin next year

చిన్నా చితకా కోలీవుడ్ హీరోలు కూడా తెలుగులో బిజినెస్ లు చేస్తుంటే... స్వతహాగా సాంబార్ మూలాలు ఉన్న మన అగ్ర హీరోలు మాత్రం ఆ ప్రయత్నం చేయటంలో ఎందుకనో ఆసక్తి చూపలేదు. అడపాదడపా డబ్బింగ్ చిత్రాలతో సందడి చేద్దామని ప్రయత్నించినప్పటికీ ఆ ఫ్లానులు పెద్దగా వర్కవుట్ కాలేదు. అయితే క్రమక్రమంగా మార్కెట్, బిజినెస్ సూత్రాలు వంటబట్టించుకుంటున్న మన హీరోలు పరభాష ప్రాధాన్యత గుర్తించి సినిమాలు చేసేందుకు ముందుకు వస్తున్నారు. అందులో తొలిఅడుగు వేసింది మాత్రం సూపర్ స్టార్ మహేష్ బాబునే. మురగదాస్ తో ఇప్పుడు బైలింగువల్ సినిమా తీస్తున్నాడు ప్రిన్స్. ఇదిలా ఉండగా అనుహ్యాంగా అనౌన్స్ అయ్యింది బన్నీ-లింగుస్వామి బైలింగువల్ మూవీ.

నిజానికి అల్లు అర్జున్ .. లింగుస్వామి కాంబినేషన్లో ఒక సినిమా రెండేళ్ల క్రితమే రావాల్సి ఉంది. కథా, స్క్రిప్ట్ అంతా పూర్తయ్యాక ఉన్నపళంగా ప్రాజెక్టు అటకెక్కింది. అయితే వేరే హీరోలతో లింగుస్వామి కమిట్ మెంట్ల కారణంగానే బన్నీ ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడన్నది అప్పట్లో బాగా వినిపించింది. మధ్యలో లింగుస్వామి మహేష్ బాబుతో సినిమా అన్న అది గాసిప్ గానే మిగిలిపోయింది. అయితే మళయాళంలో మాంచి బిజినెస్ ఉన్న అల్లు అర్జున్ పుట్టి పెరిగిన చెన్నైని వదులుకోవటానికి సిద్ధంగా లేడు. ఈ క్రమంలోనే గత కొంతకాలంగా మళ్లీ చర్చలు ప్రారంభించాడు. మధ్యలో విశాల్ పందెం కోడి-2 టాపిక్ రావటంతో మళ్లీ ప్రాజెక్టు పోయినట్లే అనుకున్నారు.

కానీ, రీసెంట్ గా లింగుస్వామి ఎన్టీఆర్ కి ఓ కథ వినిపించగా, అది జూనియర్ కి అంతగా నచ్చలేదంట. దీంతో ఇక తెలుగులో ట్రయల్స్ మానుకోవాలని స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యి చెన్నై తిరుగు ప్రయత్నం అయ్యాడు లింగుస్వామి. విషయం తెలుసుకున్న బన్నీ మళ్లీ లింగుస్వామికి కబురుపెట్టడం, అంతకు ముందు నెలకొన్న మనస్పర్థలను పక్కనబెట్టి సినిమాకు సిద్ధమైపోయారు. గురువారం చెన్నైలో జరిగిన అఫీషియల్ ప్రెస్ మీట్ లో పోస్టర్ తో సహా చిత్ర యూనిట్ మొత్తం పాల్గొంది. తన అరవ డెబ్యు గురించి అల్లు అర్జున్, బన్నీని డైరక్ట్ చేసే అదృష్టమంటూ లింగుస్వామి బాగానే మాట్లాడారు. తెలుగు .. తమిళ భాషల్లో తెరకెక్కనున్న ఈ సినిమాకి గ్రీన్ స్టూడియో జ్ఞానవేల్ రాజా నిర్మాతగా వ్యవహరించనున్నాడు. పిబ్రవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి వచ్చే యేడాది చివర్లోనే సినిమా రిలీజ్ చేయనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Allu Arjun  Linguswamy  Movie  announced  pressmeet  

Other Articles