నటి రమ్యను హైలెట్ చేస్తున్న పాక్ మీడియా | Pakistani media loves Ramya

Pakistani media loves ramya

Pakistani media loves Ramya, Pak special stories on actress ramya, Special Story on Ramya, Pak loved indian Actress, Ramya Pak not hell comments

Pakistani media loves Ramya for positive comments on their country.

పాక్ మీడియాలో కన్నడ నటి హల్ చల్

Posted: 08/26/2016 01:20 PM IST
Pakistani media loves ramya

పాకిస్థాన్ నరకం కాదు అంటూ కన్నడ నటి రమ్య చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ఎంత దుమారం రేపుతున్నాయో మనకు తెలిసిందే. అయితే తమ గడ్డ గురించి పాజిటివ్ గా మాట్లాడినందుకు రమ్య ఇప్పుడు పాక్ మీడియాలో హైలెట్ అవుతోంది. పాక్ టీవీ చానెళ్లలో, పత్రికల్లో ఇప్పుడు ఆమెపై ప్రత్యేక కథనాలు ప్రచురించడం ఆసక్తికరంగా మారింది.

ఆమె చేసిన వ్యాఖ్యలు, తీవ్ర విమర్శలు, దేశ ద్రోహం కేసు అంటూ డిమాండ్లు, ఆఖరికి నిన్న కోడిగుడ్ల దాడికి గురైన అంశాలు ఇలా ఏ ఒక్క టాపిక్ వదలకుండా అన్ని అంశాలను అక్కడి ప్రసార మాధ్యమాలు ప్రముఖంగా ప్రచురించాయి. పాక్ ను పొగిడినందుకు భారత నటిపై దేశ ద్రోహం కేసు అని ప్రముఖ పత్రిక ది డాన్ కథనంతో వేసి అభిప్రాయం కోరింది. దీనికి చాలా మంది భిన్నంగా స్పందించారు. రమ్య ను ఈ సమయంలో మనం పొగడవద్దు. ఎందుకంటే దాని ద్వారా ఆమెకు ఎక్కువ హాని జరిగే అవకాశం ఉందని ఓ రీడర్ కామెంట్ చేయగా, ఆమె చెప్పిందాట్లో తప్పేం లేదు. రాజకీయ నేతలు స్వార్థం కోసం ఆమెను బలి చేస్తున్నారంటూ మరో రీడర్ కామెంట్ చేశాడు.

ఇక ది డెయిలీ పాకిస్థాన్ అయితే ఆమె క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదన్న వ్యాఖ్యలను హైలెట్ చేస్తూ కథనం రాసింది. టీవీ జియో చానెల్ మరో అడుగు ముందుకు వేసి రమ్య అసలు పేరు దివ్య స్పందన అని, ఆమె చరిత్ర గురించి అంటూ ఓ ప్రత్యేక స్టోరీని ప్రసారం చేసింది. మరికొన్ని చానెళ్లు ఆమె వ్యాఖ్యలపై డిస్కషన్లు మొదలుపెట్టాయి. మొత్తానికి ఆమె వ్యాఖ్యలు వివాదం అయితే అయ్యింది కానీ, రాత్రికి రాత్రే ఈ కాంగ్రెస్ మాజీ ఎంపీ ని పాకిస్థాన్ టీవీలో సెలబ్రిటీని చేసి పడేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pakistan  media  kannada  actress  ramya  highlight  

Other Articles