మహేష్ ను పొగిడిన మురగదాస్ | A R Murugadoss praises mahesh babu

Director murugadoss praises mahesh babu

Murugadoss praises mahesh, mahesh babu Murugadoss, Mahesh praised by star director, star director praised mahesh babu, Murugadoss about mahesh, Mahesh about murugadoss

Murugadoss praised mahesh babu in a news paper interview says, dedication in sets.

తమిళ పత్రికలో మహేష్ గురించి ఏం రాశారు?

Posted: 08/26/2016 11:13 AM IST
Director murugadoss praises mahesh babu

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇండియన్ వైడ్ గా గుర్తింపు ఉన్న కథానాయకుడు. సినిమాల పరంగానే కాదు, వాణిజ్య ప్రకటనల ద్వారా అత్యధికంగా సంపాదిస్తున్న సౌత్ స్టార్ హీరోల్లో మహేష్ నంబర్ వన్. మాములుగా స్టార్ డమ్ కాస్త తగిలిందంటేనే భూమ్మీద ఉండని హీరోలు ఉన్నారు. అలాంటిది ఇంత స్థాయిలో ఉన్న మహేష్ సింప్లిసిటీగా ఉండటం చాలా ఆశ్చర్యంగా ఉంది అంటున్నాడు స్టార్ దర్శకుడు మురుగదాస్.

మురుగదాస్ దర్శకత్వంలో ప్రస్తుతం మహేష్ ఓ ద్విభాషా చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. తాజాగా ఈ సినిమాను గురించి ఓ తమిళ పత్రికతో మురుగదాస్ మాట్లాడుతూ, మహేశ్ గురించి ప్రస్తావించాడు. ఒక సన్నివేశాన్ని గురించి చెబుతున్నప్పుడు మహేశ్ ఎంతో శ్రద్ధ పెట్టి వింటాడని, ఆ సీన్ చేశాక ఆయన తన వైపు చూస్తారనీ, తనలో ఏ మాత్రం అసంతృప్తి కనిపించినా ఆయనే నెక్స్ట్ టేక్ కి వెళదామని చెబుతాడని అన్నాడు.

మహేశ్ గొప్పనటుడనీ .. ఆయన అంకితభావాన్ని ఈ సినిమా కారణంగా తాను చూడగలిగానని చెప్పాడు. సెట్లో కూడా 'ప్రిన్స్' పేరుకి తగినట్టుగానే ఆయన హుందాగా నడచుకుంటారంటూ ప్రశంసించాడు. మెగాస్టార్ తో సహా ఇండస్ట్రీలో చాలా మంది పెద్ద హీరోలతోనే పని చేశాడు మురగదాస్. కానీ, సినిమా గురించి తప్ప ఏ సందర్భంలోనూ హీరో గురించి ఇంతలా గొప్పలు చెప్పిన దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలో మహేష్ గురించి స్పెషల్ గా చెప్పడాన్ని హైలెట్ చేస్తూ ఆ తమిళ పత్రిక కథనం రాయటం కన్నా గ్రేట్ కాదంటారా?.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Murugadoss  mahesh babu  praise  

Other Articles