I don t have any limitations says akshara haasan

akshara, akshara haasan, bollywood movie shamitabh, akshara haasan latest news, akshara haasan latest stills, akshara haasan shamitabh, akshara haasan photos, akshara haasan gallery, akshara haasan dating, akshara haasan latest updates, amitabh latest news, akshara upcomming movies, akshara haasan updates, dhanush latest news, akshara haasan marriage, akshara haasan movie photos, akshara haasan videos, akshara haasan twitter, akshara haasan facebook, akshara haasan biography, akshara haasan and dhanush

Akshara Haasan, set for Bollywood debut with "Shamitabh", says she doesn't want to restrict herself on-screen.

హద్దులు లేవు.. డేటింగ్ వార్తలు నిజమే..

Posted: 02/01/2015 06:44 PM IST
I don t have any limitations says akshara haasan

అక్క అక్కడా, ఇక్కడ కష్టపడి అవకాశాలను తెచ్చుకుని బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తే.. చెల్లి మాత్రం ఏకంగా బాలీవుడ్ లోనే అవకాశం రావడంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇంతకీ ఎవరా అక్కచెల్లళ్లు అనుకుంటున్నారా..? వారే శృతి హాసన్, అక్షర్ హాసన్.. తాను పడిన కష్టాలు తన చెల్లి పడకూడదని.. మంచి అవకాశాన్ని అక్షరకు అందింపజేసింది శృతి హాసప్. అయితే షమితాబ్ సినిమాతో వెండి తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ తాను ఇండస్ట్రీలో ఎటువంటి హద్దులు పెట్టుకోలేదని అంటోంది.చిత్ర సీమలో ఎదగాలంటే ఫలనా మూవీనే చేయాలంటూ నియమాలు పెట్టుకోకూడదని స్పష్టం చేసింది.' మీరు హద్దులు ఏర్పరుచుకుంటే నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరడం కష్టం. ఏ పాత్ర వచ్చినా చేసేందుకు సిద్ధంగా ఉండాలి. అప్పుడే లక్ష్యాన్ని చేరుకుంటాం' అని అక్షర తెలిపింది.
 
తానైతే ఎటువంటి హద్దు ఏర్పరుచుకోకుండానే రాణిస్తానని పేర్కొంది. తనకు గత కొంత కాలంగా నటించే అవకాశాలు వస్తున్నా సరైన సమయం కోసం వేచి చూశానని తెలిపింది.తాను ఒక అసిస్టెంట్ డైరెక్టర్ కూడా కావడం వల్ల ఇప్పటి వరకూ ఎటువంటి నిర్ణయం తీసుకోలేక పోయానని పేర్కొంది. ధనుష్-అమితాబ్ బచ్చన్ లు నటించిన షమితాబ్ సినిమాలో తనకు అవకాశం రావడం పట్ల ఆనందం వ్యక్తం చేసింది. బాలీవుడ్ లో నటిగా నిలదొక్కుకున్న తరువాత తమిళ, దక్షిణాది చిత్రాలు చేస్తానంటున్నారు. ఈమె ధనుష్ సరసన నటించిన హిందీ చిత్రం షమితాబ్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది.

అక్క శ్రుతిహాసన్ తన కెప్పుడూ రక్షణగానే నిలుస్తుందన్నారు. దర్శకత్వం చేయాలనే ఆశ తగ్గలేదని, కథలు కూడా సిద్ధం చేసుకుంటున్నానని చెప్పారు. ఈ ప్రతిభ నాన్న నుంచే అబ్బిందని చెప్పారు. తమిళ చిత్రాల్లో నటించాలనే ఆసక్తి ఉన్నా ప్రస్తుతం బాలీవుడ్‌లో నటిగా నిలదొక్కుకోవాలన్నారు. తాను హిందీనటుడు వివన్‌షాతో డేటింగ్ చేశానని, అయితే ప్రస్తుతం స్నేహితులుగా మాత్రమే నడుచుకుంటున్నామని పేర్కొన్నారు. తాను కఠిన శ్రమ జీవి అని ఆత్మవిశ్వాసం అధికం అని అక్షర పేర్కొంది.

 జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : akshara haasan  bollywood news  shamitabh  

Other Articles