Pk movie thid poster released

aamir khan, aamir khan latest, aamir khan movies, aamir khan images, aamir khan pk movie, aamir khan pk movie posters, pk movie third poster, aamir khan's satyameva jayathe show, bollywood, latest news

aamir khan's latest pk movie third poster released : in third of pk poster aamir khan get up is in police officer dress

పోలిసు డ్రెస్సులో పీకే కొత్త పొస్టర్

Posted: 09/16/2014 06:06 PM IST
Pk movie thid poster released

అభిమానులు భారీ అంచనాలతో ఎదురుచూస్తున్న పీకే మూవి విడుదలకు ముందే సంచలనం సృష్టిస్తోంది. సినిమా మూడవ పోస్టర్ మంగళవారం విడుదల అయింది. ఇందులో గతంలో కంటే డిఫరెంటుగా అమీర్ ఖాన్ కన్పించాడు. తొలి పోస్టర్ లో బట్టల్లేకుండా ఉండగా.., రెండవ పోస్టర్ లో బ్యాండు వాలా దుస్తుల్లో కామెడి గెటప్ లో కన్పించాడు. తాజా పోస్టర్ లో పోలిస్ యునిఫాం వేసుకుని ముఖం సీరియస్ గా పెట్టాడు. అయితే గెటప్ చూస్తేమాత్రం కాస్త కామెడి కన్పిస్తోంది. చిన్నపిల్లాడిలా సీరియస్ ఫేస్ తో పాటు, మెడలో ఓ బ్యాగు వేసుకుని ఎక్కడికో బయల్దేరుతున్నట్లుగా పోస్టర్ ఉంది.

సినిమా మూడవ మోషన్ పోస్టర్ యూట్యూబులో ఫ్యాన్స్ నీరాజనాలు అందుకుంటోంది. మోషన్ లో సంజయ్ దత్ అలా మెరిసి వెళ్లిపోయారు. రెండవ పోస్టర్ లో అమీర్ బ్యాండువాలా దుస్తుల్లో దర్శనమిస్తే.., ఇప్పడు సంజయ్ బ్యాండువాలా బట్టలేసుకున్నాడు. ఈ సినిమా డిసెంబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. తొలి పోస్టర్ విడుదలై సంచలనాలు సృష్టించటంతో పాటు విమర్శలు కూడా తెచ్చిపెట్టింది. బట్టల్లేకుండా ఉండటంపై పలు మహిళా సంఘాలు ఇతర సంస్థలు అభ్యంతరం తెలిపాయి. ఇలాంటి వాటిని ప్రోత్సహించవద్దని విమర్శించాయి.

అయితే వారు ఊహిస్తున్నట్లుగా సినిమాలో సంఘవ్యతిరేకంగా ఏమి ఉండదని అమీర్ వివరణ ఇచ్చారు. అంతేకాకుండా తదుపరి పోస్టర్ ఇంతకంటే భిన్నంగా ఉంటుందని చెప్పారు. అనుకున్నట్లుగానే రెండవ, మూడవ పోస్టర్లు పూర్తి బట్టలతో బయటకు వచ్చాయి. ఈ ఫోటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. పోస్టర్లను బట్టి సినిమాలో డిఫరెంట్ క్యారెక్టర్లు, వేరియేషన్లు ఉంటాయని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. పూర్తి వివరాలు తెలియాలంటే మరో రెండు నెలలు ఆగాల్సిందే.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : aamirkhan  pk movie  latest news  bollywood  

Other Articles