Ntr started cost cutting

junior ntr, ntr, ntr images, ntr marriage, ntr latest movies, ntr films, ntr movies, ntr latest photos, ntr comments, nandamuri fans, balakrishna, latest news,

junior ntr started cost cutting for his movies by reducing remuneration rate : ntr suggests producers not to spend much money and dont pay high remuneration for heroines

‘అతి’గా చేయొద్దని నిర్మాతలకు షాకిచ్చిన ‘‘ఎన్టీఆర్’’

Posted: 09/16/2014 05:33 PM IST
Ntr started cost cutting

స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ వెలుగులు కొద్దికాలంగా తగ్గాయి. తారకరాముడు కష్టపడి సినిమాలు తీస్తున్నా.., బాక్సాఫీసు గెలుపు తలుపులు మాత్రం తీయటం లేదు. అసలు తలుపుకొట్టలోని సినిమాలు కూడా కొన్ని ఉన్నాయి. తాజాగా విడుదలైన ‘రభస’ సినిమా కూడా అంతంతమాత్రంగానే నడిచిందని చెప్పుకోవచ్చు. ఇలా జరుగుతుండటానికి కారణం అభిమానుల అతి అంచనాలా.., లేక మరేదైనా వైఫల్యం ఉందా అని వెనక్కి తిరిగి చూసుకున్నాడు. బాగా ఆలోచించి కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నాడు. అదే కాస్ట్ కటింగ్. సాఫ్ట్ వేర్ కంపనీల్లో ఉండే విధానంను సినిమాలకు కూడా వర్తింపచేయాలని నిర్ణయం తీసుకుని సంచలనం సృష్టిస్తున్నాడు.

కాస్ట్ కటింగ్ ను తారక్ తన నుంచే మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే తన రెమ్యూనరేషన్ తగ్గించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇకపై సినిమాలకు తక్కువ డబ్బులు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు. ప్రస్తుతం చేస్తున్న బండ్లగణేష్ సినిమా నుంచే ఈ కటింగ్ అమల్లోకి వస్తుంది. ఇక తన సినిమాల్లోనటించే హీరోయిన్లకు కూడా డబ్బులు కాస్త ముందు వెనక చూసి ఇవ్వాలని చెప్పాడని సమాచారం. ఈ విషయాన్ని వారికి స్వయంగా చెప్పాడట. అటు సినిమా నిర్మాణంలో కూడా డబ్బులు నీళ్లలా వాడవద్దని హెచ్చరించినట్లు టాలీవుడ్ వర్గాలు అంటన్నాయి. ఎక్కడ నెగ్గాలో... ఎక్కడ తగ్గాలో కాకుండా ఎక్కువగా దాచుకోవటానికి అవకాశాలు చూడండి అని సూచించినట్లు ఫిలింనగర్ టాక్.

దీనిపై తారకరాముడు అధికారికంగా ప్రకటన చేయలేదు. అయితే ఆచరణను మాత్రం చేసుకుపోతున్నట్లు తెలుస్తోంది. ఈ ఆలోచన నిజంగా హర్షించదగ్గ విషయం. ఎన్టీఆర్ ను అందరూ మెచ్చుకోవాల్సిందే. అయితే దీని వల్ల ఎంతవరకు ప్రయోజనం.. సినిమాపై ప్రభావం ఎలా ఉంటుంది. బడ్జెట్ తక్కువ అంటే పెద్ద హీరోయిన్లు వస్తారా.. రెమ్యూనరేషన్ అంత ఇవ్వలేము అంటే ఒప్పుకుంటారా? అనేది ప్రశ్న. తాను మంచివాడు సరే..., సమాజం తన వెంట నడవాలంటే మాకేంటి అని అడిగేవారు చాలామంది ఉన్నారు. అలాంటి పరిస్థితుల మద్య ఎవరు ఒప్పుకుంటారు ? అని సందేహాలు మొదలయ్యాయి.

‘నిన్ను చూడాలని’తో టాలీవుడ్ లో హీరోగా కెరీర్ మొదలు పెట్టిన జూనియర్ ఎన్టీఆర్ స్టూడెంట్ నెంబర్ 1, ఆది, సుబ్బు, నాగ వంటి సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన ‘‘సింహాద్రి’’ కెరీర్ బ్లాక్ బస్టర్ అయింది. ఈ సినిమా అప్పటివరకున్న రికార్డులను తిరగరాసింది. అయితే ఆ తర్వాత ఎన్టీఆర్ ఇమేజ్ పెరగటంతో ఆ స్థాయిలో సినిమాలు తీయలేక కొన్ని ఫ్లాపులు పడ్డాయి. మద్యలో మంచి సినిమాలు వచ్చినా.., ప్రేక్షకులు రామ్ ను ఊహించుకున్నదానికంటే కొత్తగా చూడలేకపోయారు. మళ్ళీ కుదురుకని అదుర్స్, బృందావనం, బాద్ షా వంటి హిట్ లు అందుకున్నాడు. తాజాగా వచ్చిన ‘‘రభస’’ అంచనాలు అందుకోలేదు. ఇలా కెరీర్ లో ఒడిదుడుకులు చూస్తున్నాడు ఎన్టీఆర్. అందువల్లే

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jr ntr  jr ntr movies  latest news  tollywood  

Other Articles