Sunny leone in hate story 3 movie

sunny leone, sunny leone hot photo shoot, sunny leone latest photos, sunny leone hate story 3 movie, hate story 3 movie, surveen chawla, hate story 2 movie, sunny leone movies, sunny leone hot scenes

sunny leone in hate story 3 movie : porn star sunny leone to act in hate story 3 movie

సన్నీ ప్రియులకు గుడ్ న్యూస్! త్వరలోనే బూతు సినిమా!

Posted: 09/05/2014 06:02 PM IST
Sunny leone in hate story 3 movie

(Image source from: sunny leone in hate story 3 movie)

పోర్న్ మూవీలతో కెరీర్ ను ప్రారంభించిన సన్నీలియోన్.. ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా పాగా వేసిన విషయం అందరికీ తెలిసిందే! హిందీలో సన్నీ నటించిన చిత్రాలన్నింటిలోనూ తన హాట్ అందాలతో, బెడ్ రూమ్ సన్నివేశాలతో కుర్రకారుల మతి పోగొట్టేసింది కానీ.. పూర్తి శృంగార సన్నివేశాల్లో మాత్రం కనిపించలేదు. అయితే ఆ ముచ్చట కూడా ప్రేక్షకాభిమానులకు తీర్చడానికి సన్నీలియోన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. త్వరలోనే సన్నీలియోన్ బూతు సినిమాను తెరకెక్కించడానికి బాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాలు సన్నాహాలు సిద్ధం చేస్తున్నాయని వార్తలు వస్తున్నాయి.

ఇటీవలే బాలీవుడ్ లో రిలీజైన ‘‘హేట్ స్టోరీ-2’’ సినిమా ఎటువంటి సంచలనాలను సృష్టించిందో అందరికీ తెలిసిందే! కథ రొటీన్ అయినప్పటికీ అందులో హీరోయిన్ సుర్వీన్ చావ్లా నటించిన శృంగార సన్నివేశాలు జనాలకు పిచ్చెక్కించే విధంగా వుండటంతో భారీ కలెక్షన్లను రాబట్టుకుంది. కేవలం 8.5 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఆ మూవీ దాదాపు 35 కోట్లకుపైగా కలెక్షన్లను రాబట్టిందని ఆ మూవీ యూనిట్ పేర్కొంటోంది. అయితే ఇంత కలెక్షన్లు రావడానికి కేవలం సుర్వీన్ చావ్లాయే కారణమని.. ఆ సినిమాలో అమ్మడు ఎటువండి బెడియం లేకుండా లిప్ లాక్, బెడ్ రూమ్ సన్నివేశాల్లో బరితెగించి నటించడం వల్లే మూవీ విజయం సాధించిందని అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి ఆ సినిమా విజయానికి కారణం కేవలం సుర్వీన్ చావ్లా ఎక్స్ పోజింగేనంటూ స్పష్ట చేస్తున్నారు.

ఇదిలావుండగా.. తాజాగా ఆ మూవీ యూనిట్ మెంబర్లు ‘‘హేట్ స్టోరీ-3’’ చిత్రాన్ని తెరకెక్కించడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుపుతున్నారు. ఇందులో హీరోయిన్ గా సన్నీలియోన్ ను తీసుకున్నట్టు బాలీవుడ్ వర్గాలు తెలుపుతున్నాయి. తొలుత ఈ మూవీ హీరోయిన్ గా సోనాలి రౌత్ ను సంప్రదిచగా.. అందుకు ఆ అమ్మడు నిరాకరించింది. దీంతో ఈ అవకాశం సన్నీలియోన్ దక్కింది. తమ సినిమాలో నటించాల్సిందిగా దర్శకనిర్మాతలు ఆమెను సంప్రదిస్తే.. ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా ఓకే చెప్పేసిందని ఇండస్ట్రీ వర్గాలు తెలుపుతున్నాయి.

ఇప్పటికే హేట్ స్టోరీ - 2 బూతు సినిమాగా ప్రచారాలు కొనసాగిన విషయం తెలిసిందే! ఇక పోర్న్ స్టార్ స్థాయి నుంచి వచ్చిన సన్నీలియోన్ ఇటువంటి సినిమాలో నటిస్తే.. అది ఏ రేంజిలో వుంటుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస విజయాలతో ఫుల్ ఫాంలో వున్న సన్నీలియోన్.. తాను ఎటువంటి చిత్రాల్లో నటించడానికైనా సిద్ధమేనని గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే! మరి ఈ సినిమాలో సన్నీ ఏ రేంజిలో రెచ్చిపోతుందో వేచి చూడాల్సిందే! యూనిట్ సభ్యులు కూడా ఈ సినిమాను మరింత హాటుగా తెరకెక్కించేలా కథను అల్లుతున్నారని.. సన్నీ ఇమేజ్ కు తగ్గట్టుగానే ఇందులో శృంగార సన్నివేశాలు కూడా వుంటాయని టాక్!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sunny leone  hate story series  surveen chawla  bollywood  

Other Articles