Pawan kalyan in dialoma gopala gopala movie shooting

pawan kalya, gopala gopala movie, pawan kalyan latest movie news, pawan kalyan gopala gopala movie, gopala gopala movie first look, pawan kalyan movies

pawan kalyan in dialoma gopala gopala movie shooting

గందరగోళ పరిస్థితిలో పవన్ కల్యాణ్.. గోపాలుడికి సవాల్!

Posted: 09/05/2014 05:14 PM IST
Pawan kalyan in dialoma gopala gopala movie shooting

(Image source from: pawan kalyan in dialoma gopala gopala movie shooting )

టాలీవుడ్ పవర్ స్టార్, జనసేనాధిపతి పవన్ కల్యాణ్ ప్రస్తుతం చాలా గందరగోళ పరిస్థితిలో వున్నాడని తెలుస్తోంది. ఒకవైపు పాలిటిక్స్.. మరోవైపు మూవీ షూటింగ్ లతో బిజీగా వున్న పవన్.. ఎటువైపు సరిగ్గా దృష్టిని కేంద్రీకరించాలోనన్న అయోమయ స్థితిలో పడిపోయాని ఇండస్ట్రీవర్గాలు పేర్కొంటున్నాయి. చాలారోజుల గ్యాప్ తర్వాత ముఖానికి మేకప్ వేసుకుంటున్న తరుణంలోనే.. మెదక్ ఉపఎన్నికలు పవన్ కు పెద్ద సవాల్ గా మారిపోయాయని సన్నిహితవర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో పవర్ స్టార్ తాజాగా నటిస్తున్న ‘‘గోపాల గోపాల’’ చిత్రం వాయిదాలు పడుకుంటూ పోతోందని ఆ యూనిట్ సభ్యులు వాపోతున్నారు.

ఇప్పటికే ‘‘గోపాల గోపాల’’ చిత్రానికి సంబంధించి టాలీవుడ్ లో రకరకాల వార్తలు వస్తున్నాయి. పవన్ కల్యాణ్ వల్లే ‘‘గోపాల గోపాల’’ చిత్రం షూటింగ్ వాయిదా పడుకుంటూ వస్తోందని ఆ మూవీ యూనిట్ సభ్యులు పేర్కొంటున్నారు. ఈ మూవీ బిజినెస్ భారీస్థాయిలో వుంటుందని భావించిన దర్శకనిర్మాతలు.. ప్రస్తుత నిర్మాణ పనులు అనుకున్నదానికంటే చాలా ఆలస్యంగా జరుగుతున్నాయని నిరాశగా వున్నట్టు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే పవన్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేయాల్సిన ఫస్ట్ లుక్ ని కూడా పోస్ట్ పోన్ చేసుకోవాల్సి వచ్చిందని.. ఫస్ట్ లుక్ విడుదల తేదీని ఇప్పుడే ఖరారు చేయలేమని యూనిట్ పేర్కొంటోంది. ఇందుకు ముఖ్యకారణం పవన్ కల్యాణేనని వారు చెబుతున్నారు. ఎందుకంటే.. మునుపటిలా అనుకున్నవిధంగా పవన్ కల్యాణ్ రోల్ సెట్ కావడం లేదని.. ఆ రోల్ చాలా గందరగోళంగా మారిపోయిందని అంటున్నారు.

మూవీలో పవన్ క్యారెక్టర్ నిడివి అనుకోకుండా పెంచాల్సి వచ్చిందని.. పైగా కథనంలో కూడా చాలా మార్పులు చేయాల్సి వచ్చిందని యూనిట్ మెంబర్లు వాపోతున్నారు. రోజురోజుకు ఈ మూవీలో కొత్తకొత్త మార్పులు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో షూటింగ్ టైం పెరుగుతోందని.. దీంతో రిలీజ్ డేట్ రానురాను వెనక్కు వెళుతోందని వారు స్పష్టం చేస్తున్నారు. దీంతో గోపాల గోపాల చిత్రం షూటింగ్ రానురాను సవాల్ గా మారుతోందని.. ఇప్పటికిప్పుడే ఈ మూవీకి సంబంధించిన విషయాల మీద ఏమీ స్పష్టత ఇవ్వలేమని వారు చెబుతున్నారు. మొత్తానికి పవన్ అటు రాజకీయరంగంలో, ఇటు మూవీ షూటింగ్ లతో చాలా గందరగోళంగా కాలాన్ని గడుపుతున్నట్టు తెలుస్తోంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  gopala gopala movie  tollywood  telugu news  movie news  

Other Articles