Sweta basu prasad prostitution case director bhansal mehta supports

sweta basu prasad, sweta basu prasad prostitution, sweta basu prasad latest news, sweta basu prasad hot photos, director hansal mehta, hansal mehta twitter, sweta basu prasad caught prostitution

sweta basu prasad prostitution case director bhansal mehta supports : In the case of sweta prostitution... all over in the india news were spreaded about her only targeting by her.

శ్వేతను అవమానపరిచారు కానీ.. అసలు సంగతి మరిచిపోయారు!

Posted: 09/06/2014 05:08 PM IST
Sweta basu prasad prostitution case director bhansal mehta supports

(Image source from: sweta basu prasad prostitution case director bhansal mehta supports)

ప్రపంచవ్యాప్తంగా ఎక్కడాలేని విధంగా మన భారతదేశంలో ఒక విచిత్ర సంస్కృతి బాగానే ప్రచారాంలోకి వచ్చినట్లు తెలుస్తోంది. అదేనండి! ఎవరైనా ఒక వ్యక్తి మంచి చేసినప్పుడు వచ్చే ప్రచాకం కన్నా.. చెడు చేసినప్పుడే పెద్దఎత్తున వుంటుంది. ఇంకొక కోణంలో చెప్పుకోవాలంటే.. ఒక వ్యక్తిని సంతోషపరచడం కన్నా దు:ఖపెట్టడమే ఇండియన్ కల్చర్ అనే పరిస్థితి! అంతేకదా.. మనం చరిత్రలు తవ్విచూసినా ఇటువంటి సంఘటనలే వుంటాయి. మంచోళ్లు ఎక్కడో కనుమరుగై పోయి వుంటారు కానీ చెడు చేసినవారు మాత్రం ఇప్పటికీ టాప్ ప్లేస్ లో వుంటారు. అంటే.. మంచివాడికంటే చెడు చేసిన వాడి మీదే ఎక్కువ ప్రచారాలు చాలాకాలం వరకూ కొనసాగుతూనే వుంటాయి. అందుకు ఉదాహరణగా మనం ఇక్కడ శ్వేతబసు ప్రసాద్ నే తీసుకోవచ్చు.

ఇటీవలే వ్యవభిచారం టాస్క్ ఫోర్స్ పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన శ్వేతబసు ప్రసాద్ వ్యవహారం గురించి దేశం మొత్తం మీద రకరకాల వార్తాకథనాలు వస్తున్నాయి. ఈ అమ్మడు వ్యభిచారంలో పట్టుబడిందని మాత్రమే వార్తలు వస్తున్నాయి కానీ.. ఈమెతో పట్టుబడిన బడాబాబులు, మధ్యవర్తుల పేర్లు మాత్రం అస్సలు వినిపించడం లేదు. అసలు వారి ప్రస్తావన ఇంతవరకు రానూలేదు. ఎక్కడా చూసిన ఈమెకు వ్యతిరేకంగా విమర్శలు మాత్రమే వినిపిస్తున్నాయి. హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిపోదామని చిత్రపరిశ్రమలో అడుగుపెట్టిన శ్వేత జీవితం హఠాత్తుగ ఇలా మలుపు తీసుకుంటుందని ఆమె కూడా ఊహించి వుండదు. తన కుటుంబం ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కుంటోందని, తప్పని పరిస్థితుల్లో ఇలా వ్యభిచారంలోకి దిగాల్సి వచ్చిందని స్వయంగా ఆ అమ్మడు ఒప్పుకోవడం గమనార్హం. ఎవరైనా నాలుగురాళ్లు వెనక్కు వేసుకుని, మంచి పేరు సంపాదించుకోవాలని చూస్తారే కానీ.. ఇలా అనవసరంగా వ్యభిచారంలోకి అడుగుపెట్టరు. తానిలా వ్యభిచారంలోకి వచ్చిందంటే.. అందుకు ఏదో బలమైన కారణమే వుండి వుంటుంది.

అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. శ్వేతబసుప్రసాద్ వ్యభిచారంలో పట్టుబడిందనే వార్తలు బాగానే ప్రచారం అవుతున్నాయి గానీ అందులో పట్టుబడిన వారి విషయాలు మాత్రం ఇంతవరకు బయటికి రాలేదు. ముఖ్యంగా వారి ఫోటోలు, వివరాలను బయటపెట్టాల్సిందిపోయి, ఈమెనే ఇక్కడ హైలైట్ చేయడం చాలా అనుమానాలకు తావిస్తున్నాయి. ఈమెతో పట్టుబడిన ఆ బడాబాబులు లంచం ఇచ్చి బయటపడ్డారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. లేకపోతే ఇంతవరకు వారి పేర్లు ఎందుకు బయటికి రావడం లేదంటూ ప్రశ్నోత్తరాలు వస్తున్నాయి. కానీ పోలీసులు మాత్రం ఈ విషయం మీద ఎటువంటి సమాచారాన్ని అందించడం లేదు. అసలు విషయం మర్చిపోయి, కేవలం ఒక యాక్ట్రెస్ ఇలా బహిరంగంగా అవమానం పర్చడం నిజంగా మన సభ్యసమాజానికి అవమానకరంగానే భావించాలి. ఎంత వ్యభిచారంలో పట్టుబడితే ఏం.. తనూ ఒక అమ్మాయే.. ఒక తండ్రి కూతురే... ఒక ఇంటికి లక్ష్మీయే.. ఆ విషయాలను కాస్త దృష్టిలో పెట్టుకని ఈమెకు వ్యతిరేకంగా కాకుండా.. మద్దతుగా ప్రచారాలు చేస్తే దానికో అర్థం వుంటుంది.

ఇదిలావుండగా.. ఈమెమీద నిత్యం వ్యతిరేకంగా వస్తున్న వార్తల నేపథ్యంలో ఒక బాలీవుడ్ డైరెక్టర్ ఈమెకు మద్దతుగా నిలిచి శెభాష్ అనిపించుకోవడమే కాకుండా... వ్యతిరేకంగా మాట్లాడుతున్న వాళ్ల నోళ్లను మూయించేశాడు. ‘‘శ్వేత ఫొటోలను ప్రచురించడం ఆపండి. ఆ రోజు ఆమెతో పాటు ఉన్న ఆ బడా క్లయింట్ల ఫొటోలను బయటపెట్టండి. అలాగే, ఆ వ్యవహారానికి వారధిగా ఉన్న ‘మధ్యవర్తి’ ఫొటోను బయటపెట్టండి’’ అని ట్విట్టర్ ద్వారా ఘాటుగా స్పందించారు డైరెక్టర్ హన్సల్ మెహతా. శ్వేత బాలనటిగా వున్నప్పుడు ఆమెకు ‘‘మక్డీ’’ సినిమాలో లీడ్ రోల్ ఆఫర్ ఇచ్చిన ఈ డైరెక్టర్.. ఆ చిత్రంలో బాలనటిగా శ్వేతా అభినయం తనకింకా గుర్తుందనీ, చాలా బాగా నటించిందని పేర్కొన్నాడు. అందుకే, తన తదుపరి చిత్రంలో ఆమెకు అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్టు కూడా హన్సల్ అన్నారు. జయతే, దిల్ పే మత్ లే యార్, ఉడ్‌స్టాక్ విల్లా తదితర చిత్రాలకు దర్శకత్వం వహించిన ఘనత హన్సల్‌ది. గత ఏడాది‘షాహిద్’ చిత్రానికి గాను ఉత్తమ దర్శకునిగా జాతీయ అవార్డు కూడా అందుకున్నారు. అలాంటి ప్రతిభా వంతుడు తనకు అండగా నిలవడం శ్వేతకు ఊరటగా ఉంటుందని ఊహించవచ్చు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sweta basu prasad  prostitution  hansal mehta  twitter  police investigation  

Other Articles