Eega be screened at cannes

rajamouli, eega,,Eega making its presence felt at Cannes Eega making its presence felt at Cannes, News,Telugu movie news, latest news, political news, Updated Movie NewsRajamouli, Eega, 66th cannes International film festival, Bahu Bali,Shobhu Yarlagadda

Eega is flying to Cannes. This Rajamouli directed blockbuster would be screened at Cannes Film Festival's market wing (Marché du Film.) to attract international distributors.

కేన్స్ ఫెస్టివెల్ కి ‘ఈగ ’

Posted: 05/14/2013 01:27 PM IST
Eega be screened at cannes

ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వం వహించిన ఈగ సినిమా తెలుగులోనే కాకుండా మిగతా భాషల్లో కూడా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు ఇప్పటికే నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ఉత్తమ ప్రాంతీయ చిత్ర అవార్డుతో పాటు విజువల్ ఎఫెక్టు విభాగంలో పలు అవార్డులు దక్కించుకుంది. దీంతో ఆగకుండా ఎగురుకుంటూ పోయి అంతర్జాతీయ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో కూడా వాలనుంది. ఈ చిత్రాన్ని త్వరలో జరగబోయే కేన్స్ లో ప్రదర్శించేందుకు ఎంపిక చేశారు.ఈ విషయాన్ని శోభు యార్లగడ్డ ట్విట్టర్ ద్వారా తెలిపారు. ‘ఈగ ’ చిత్రంతో పాటు, ‘బహుబలి ’ చిత్రానికి సంబంధించిన కొన్ని అంశాలను కూడా కేన్స్ ప్రదర్శించబోతున్నాం అని తెలిపాడు. ఒక తెలుగు సినిమా తొలిసారిగా కేన్స్ కు వెళ్లబోతుంది. నాని, సమంత, సుదీప్ ప్రధాన పాత్ర ధారులుగా రాజమౌళి దర్శకత్వంలో సాయి కొర్రాపాటి నిర్మించిన ఈ చిత్రం మంచి కలెక్షన్స్ సాధించిన సంగతి తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles