Tata Harrier Launched In India దేశీయ విఫణీలోకి మరో ఎస్ యూవీ.. టాటా హారియర్

Tata harrier launched in india price starts at 12 69 lakh

Tata Harrier, Harrier images, Harrier features, Harrier SUV, Harrier price, harrier variants, e-commerce, cars, technology, business

The much-awaited Tata Harrier has been launched in the country, with prices ranging from Rs 12.69 lakh to Rs 16.25 lakh (ex-showroom Mumbai).

దేశీయ విఫణీలోకి మరో ఎస్ యూవీ.. టాటా హారియర్

Posted: 01/23/2019 09:03 PM IST
Tata harrier launched in india price starts at 12 69 lakh

దేశీ ప్రముఖ వాహన తయారీ కంపెనీ టాటా మోటార్స్ తాజాగా కొత్త ఎస్ యూవీ హారియర్‌ ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. దీని ధర రూ.12.69 లక్షల నుంచి ప్రారంభమౌతోంది. టాప్ వేరియంట్ ధర రూ.16.25 లక్షలుగా ఉంది. ధరలన్నీ ఎక్స్‌షోరూమ్ ఢిల్లీవి. కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మార్కెట్‌లోకి తీసుకువచ్చిన నాలుగో మోడల్ ఇది.

టాటా హారియర్ నాలుగు వేరియంట్లలో లభించనుంది. ఎక్స్‌ఈ, ఎక్స్‌ఎం, ఎక్స్‌టీ, ఎక్స్‌జెడ్ అనే ఈ నాలుగు వేరియంట్ల నుంచి కస్టమర్లు తమకు కావాల్సిన కారును ఎంపిక చేసుకోవచ్చు. అయితే ఇవి కేవలం డీజిల్ ఆప్షన్‌లోనే అందుబాటులో ఉంటాయి. కొత్త హారియర్ ఎస్‌యూవీ ల్యాండ్ రోవర్ ఒమేగా ప్లాట్ ఫామ్ పై రూపొందింది. కంపెనీ నుంచి వస్తున్న ఫ్లాగ్‌షిప్ మోడల్ ఇది. అలాగే టాటా మోటార్స్ ఇంపాక్ట్ డిజైన్ 2.0 ప్లాట్ ఫామ్ పై వస్తున్న తొలి కారు ఇదే.

ఎస్ యూవీలో స్ల్పిట్ హెడ్ ల్యాంప్ క్లస్టర్, డేటైమ్ రన్నింగ్ లైట్స్, లార్జ్ గ్రిల్, రియర్ పార్కింగ్ సెన్సర్స్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఓఆర్‌వీఎంలు, ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, పవర్ స్టీరింగ్, డ్యూయెల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్, ఏబీఎస్, ఈబీడీ, 8.8 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్, జేబీఎల్ స్పీకర్స్, ఫుల్లీ డిజిటల్ 7 అంగుళాల ఇన్ స్ట్రూమెంట్ క్లస్టర్ వంటి పలు ప్రత్యేకతలు ఉన్నాయని కంపెనీ తెలిపింది. అలాగే ఇందులో 2 లీటర్ 4 సిలిండర్ టర్బోచార్జ్‌డ్ డీజిల్ ఇంజిన్ అమర్చినట్లు పేర్కొంది. ఎస్‌యూవీలో ఎకో, సిటీ, స్పోర్ట్ అనే డ్రైవింగ్ మోడ్స్ ఉంటాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tata Harrier  Harrier SUV  Harrier price  harrier variants  technology  business  

Other Articles

Today on Telugu Wishesh