జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్-బెంజ్.. దేశీయ విపణిలోకి సరికొత్త 'బెంజ్ - సీఎల్‌ఎస్' మోడల్‌ను శుక్రవారం (నవంబరు 16) లాంచ్ చేసింది. ఈ కారు ప్రారంభ ధరను రూ.84.70 లక్షలుగా నిర్ణయించింది. మూడోతరంగా రూపొందించిన ఈ సీఎల్‌ఎస్ మోడల్.. బీఎస్6 ప్రమాణాలకు అనుగుణంగా డీజిల్ ఇంజిన్‌తో తయారు చేసింది. ప్రస్తుతానికి మెర్సిడెస్ బెంజ్ సీఎల్ఎస్ 300డి వేరియంట్ మాత్రమే వినియోగదారులకు లభ్యం కానుంది. వచ్చే ఏడాదిలో మరిన్ని వాహనాలను విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు సంస్థ ప్రకటించింది.
బెంజ్ - సీఎల్‌ఎస్ ప్రత్యేకతలివే..
* కొత్త మెర్సిడెస్ బెంజ్ సీఎల్ఎస్ 300డీలో 'ఫేస్ లిఫ్టెడ్' సీ 300డి సెడాన్ 2.0 లీటర్ ఇంజిన్ ను అమర్చారు.
* ఈ ఇంజిన్ 245 పీఎస్ పవర్, 500 ఎన్‌ఎం టార్క్‌ను విడుదల చేస్తుంది.
* ఈ కారులో 9-స్పీడ్ ఆటో ట్రాన్స్ మిషన్ ఇచ్చారు.
* ఈ కారు 6.4 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకునే సామర్థ్యం ఉంది. దీని గరిష్ట వేగం గంటకు 250 కిలోమీటర్లుగా ఉండనుంది.
* కొత్త సీఎల్ఎస్ కారు ఈ-క్లాస్ ప్లాట్ ఫామ్ ఆధారంగా తయారైంది. దీని పొడవు, వెడల్పు, ఎత్తు ఎక్కువగా ఉంటాయి.
* స్టైలిష్ రూఫ్ లైన్, ఫ్రేమ్ లెస్ డోర్ ఈ కారు ప్రత్యేకం.
* ఇంటీరియర్ పరంగా కారును అద్భుతంగా రూపొందించారు.
* ఈ కారులో 12.3 అంగుళాల ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్ అమర్చారు. యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటోలకు కూడా సపోర్ట్ చేస్తుంది.
* కారులో సన్ రూఫ్ సౌకర్యాన్ని కూడా పొందుపరిచారు.
* 13 స్పీకర్ బర్మెస్టర్ ఆడియో సిస్టమ్
* ఎయిర్ బాడీ కంట్రోల్ ఎయిర్ సస్పెన్షన్, 18 అంగుళాల అలాయ్ వీల్స్, మల్టీబీమ్ ఎల్ఈడీ హెడ్ లైట్స్ ఈ కారులో అమర్చారు.
(And get your daily news straight to your inbox)
Feb 06 | చైనా మొబైల్ సంస్థ కూల్ ప్యాడ్ తాజాగా తన నూతన స్మార్ట్ ఫోన్ ను భారత మార్కెట్లో విడుదల చేసింది. 'కూల్ 3' పేరిట విడుదలైన ఈ ఫోన్ మిడ్ నైట్ బ్లూ, రూబీ... Read more
Jan 23 | దేశీ ప్రముఖ వాహన తయారీ కంపెనీ టాటా మోటార్స్ తాజాగా కొత్త ఎస్ యూవీ హారియర్ ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీని ధర రూ.12.69 లక్షల నుంచి ప్రారంభమౌతోంది. టాప్ వేరియంట్ ధర రూ.16.25... Read more
Oct 31 | ప్రముఖ చైనా మోబైల్ ఫోన్ల సంస్థ 'వన్‌ప్లస్' సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లో ఆవిష్కరించింది. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో 'వన్‌ప్లస్ 6టీ' స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది. గతేడాది మేలో తీసుకొచ్చిన వన్... Read more
Oct 26 | ప్రపంచ ఉక్కు దిగ్గజం ఆర్సెలార్ మిత్తల్.. ఎస్సార్ స్టీల్ ను సొంతం చేసుకుంది. దేశీయంగా ఒక ఉక్క పరిశ్రమను సొంతం చేసుకోవాలన్న కల దీంతో తీరిందని లక్ష్మీ మిత్తల్ యాజమాన్యంలోని ఆర్సెలార్ మిట్టల్ పేర్కోంది.... Read more
Oct 03 | ఓ వైపు దేశంలో ఇంధన ధరలు అల్ టైం హైలో కొనసాగుతూ.. వాహనదారులను బెంబేలెత్తిస్తుంటే.. మరో వైపు దేశీయ కరెన్సీ రూపాయి విలువ మాత్రం పాతాళానికి చేరుతుంది. అల్ టైం రికార్డు స్థాయిలో పతనమైన... Read more