RBI Governor Raghuram Rajan urges world to hike rates; but not in a 'big bang' manner

Markets should not fear volatility says raghuram rajan

raghuram rajan, RBI Governer, Invesments, Bee 20 conference, rbi, reserve bank of india, rbi governor, rbi chief rajan, rbi rajan, rbi rate cuts, finance ministry, business news, latest news

RBI Governor Raghuram Rajan today said global economies witnessing sustainable growth need to hike rates although not in a "one go, big bang" manner and that market volatility concerns should not come in the way of central bank decisions.

మార్కెట్ పతనానికి సెంట్రల్ బ్యాంకుల నిర్ణయాలకు ముడిపెట్టకూడదు

Posted: 09/05/2015 08:43 PM IST
Markets should not fear volatility says raghuram rajan

మార్కెట్లలో హెచ్చుతగ్గులు తాత్కాలికమేనని, వీటి గురించి భయపడక్కర్లేదని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ స్పష్టంచేశారు. ప్రజలు వ్యయాలు తగ్గించుకుని పొదుపుపై మరింతగా దృష్టి పెడుతున్నారని, దీనివల్ల వివిధ వస్తువులపై వ్యయం తగ్గుతోందని చెప్పారాయన. దీంతో పాటు పెట్టుబడులు తక్కువ స్థాయిలో ఉంటుండటం కూడా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను సతమతం చేస్తోందన్నారు. గ్లోబల్ ఎకానమీ ఎదుర్కొంటున్న ఇతర సమస్యలను ప్రస్తావిస్తూ... ‘‘వృద్ధి సాధించాలంటే ఆర్థికాంశాలే కీలకం. ఆయా దేశాలు పాటించే ఆర్థిక విధానాలే వాటి వృద్ధి గతిని నిర్దేశిస్తాయి’’ అని చెప్పారాయన. జీ20 దేశాలకు చెందిన బిజినెస్ లీడర్ల సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచటంపై అనిశ్చితి నెలకొటంతో ప్రపంచ మార్కెట్లలో ఆందోళన కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రాజన్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. దీన్నే ప్రస్తావిస్తూ... భవిష్యత్‌లో హెచ్చుతగ్గులపై ఆందోళనలు పరిష్కారమవ్వాలంటే ద్రవ్య విధానాలు సాధారణ స్థాయికి రావడం ఒక్కటే మార్గమని చెప్పారు. ప్రపంచ దేశాల కేంద్రీయ బ్యాంకుల విధానాలతో వ్యవస్థ  మరింత దుర్బలంగా మారిపోయే ప్రమాదం ఎదురవ్వవచ్చని రఘురామ్ రాజన్ అభిప్రాయపడ్డారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : raghuram rajan  RBI Governer  Invesments  Bee 20 conference  

Other Articles