Investor wealth dips by Rs 1.9 lakh crore as market plunges

Markets end at fresh 13 month lows as global stocks derail

RBI repo rate unchanged, Reserve Bank of India, RBI key policy rate unchanged, Federal Reserve, fiscal consolidation, GDP growth, Today sensex, today nifty, Infosys, Indian rupee, currency, dollar, BHEL, Titan, Tata Motors, Punjab National Bank, ICICI bank, Hindustan Unilever, Hero MotoCorp, International prices, American central bank interest rates, Gold price

Benchmmark share indices ended over 2% lower at fresh 13-month lows, amid weak global cues, ahead of the US jobs data that could raise the prospects of a rate hike by the US Federal Reserve rekindled fears of further foreign fund outflows.

పదిరోజుల వ్యవధిలో రెండో పర్యాయం.. ధేశీయ మార్కెట్ల బ్లడ్ బాత్

Posted: 09/04/2015 09:04 PM IST
Markets end at fresh 13 month lows as global stocks derail

అంతర్జాతీయ స్థాయిలో నెలకొన్న పరిస్థితులు భారత ఇన్వెస్టర్ల సంపదను పది రోజుల వ్యవధిలో రెండో పర్యాయం హరించాయి. విదేశీ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల పవనాల నేపథ్యంలో గత నెల 26 హరించించుకుపోయిన మదుపరులు నిధులు.. ఇవాళ వారంతంలో మరోమారు స్టాక్ మార్కెట్ల బ్లడ్ బాత్ కారణంగా హరించుకుపోయాయి. సెన్సెక్ 563 పాయింట్ల మేరకు పతనం కావడం.. అటు నిఫ్టీ కూడా 168 పాయింట్లో 2.15 శాతం మేర కుదించుకుపోవడంతో భారతీయ మార్కెట్లలోని సుమారు రెండు లక్షల కోట్ల రూపాయల మేరకు హరించుకుపోయాయి.

ఉదయం మార్కెట్లు ప్రారంభంతోనే దేశీయ సూచీలు నష్టాలను ఎదుర్కోన్నాయి. ఉదయం నుంచి తీవ్ర ఒడిదొడుకులకు లోనైన మార్కెట్లు తీవ్ర నష్టాలను మూటగట్టుకున్నాయి. ఈ వారం ట్రేడింగ్ ఆఖరి రోజైన శుక్రవారం ఉదయం మార్కెట్లు మొదలైనప్పటి నుంచి పతనం మొదలైంది. మొదటి గంట ట్రేడింగ్‌లోనే బీఎస్సీ సెన్సెక్స్ భారీగా నష్టపోయింది. 10 గంటల సమయానికి 524 పాయింట్లు నష్టపోయి 25240 పాయింట్ల దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ కూడా 7700 పాయింట్ల దిగువకు దిగజారిపోయింది. 152 పాయింట్లు కోల్పోయి 7670 పాయింట్ల దగ్గర ట్రేడవుతోంది.

దీంతో గడచిన పది సెషన్ల వ్యవధిలో భారత స్టాక్ మార్కెట్ సుమారు రూ. 10 లక్షల కోట్ల పైగా నష్టపోయింది. శుక్రవారం నాటి సెషన్ ముగిసేసరికి బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక సెన్సెక్స్ 562.88 పాయింట్లు పడిపోయి 2.18 శాతం నష్టంతో 25,201.90 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 167.95 పాయింట్లు పడిపోయి 2.15 శాతం నష్టంతో 7,655.05 పాయింట్లకు చేరాయి. నిఫ్టీకి ఇది 52 వారాల కనిష్ఠ స్థాయి కావడం గమనార్హం. నిఫ్టీ-50లో 46 కంపెనీలు నష్టాల్లో ముగిశాయి. బీపీసీఎల్, కోల్ ఇండియా, భారతీ ఎయిర్ టెల్, లుపిన్ కంపెనీలు 0.3 శాతం నుంచి 1.47 శాతం లాభపడగా, వీఈడీఎల్ గెయిల్, టాటా పవర్, టాటా స్టీల్, హిందాల్కో తదితర కంపెనీల ఈక్విటీ 4.5 శాతం నుంచి 5 శాతం వరకూ దిగజారింది.  

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Business  Markets  BSE Sensex  Nifty  Market  Gold and silver  indian rupee  RBI  

Other Articles