Lemon juice beauty tips skin whitening

lemon juice, beauty tips, lemon juice beauty tips, healthy beauty tips, skin beauty tips, skin tips, skin care tips, health benefits lemon juice, lemon juice beauty benefits

lemon juice beauty tips skin whitening : the healthy beauty tips of lemon juice remedies which improves the glow of skin and whitening

నిమ్మకాయతో చర్మఛాయను మార్చుకోండిలా...

Posted: 11/22/2014 04:36 PM IST
Lemon juice beauty tips skin whitening

ముఖవర్ఛస్సును మరింతగా మెరుగుపర్చుకోవడం కోసం ఏ బ్యూటీపార్లర్’కుగానీ, ఇతర క్రీములు వాడుకోకుండానే నిమ్మకాయరసంతో ఇంట్లోనే తయారుచేసుకునే కొన్ని రెమెడీలను చేసుకోవచ్చు. నిమ్మకాయలో చర్మసౌందర్యానికి కావలసిన విటమిన్లు, ఇతర ఖనిజాలు పుష్కలంగా వుంటాయి. అటువంటి నిమ్మాకాయరసంలో పోషక విలువలున్న ఇతర పదార్థాలను జోడించి ముఖానికి పట్టించే.. కాంతివంతమైన సహజ సౌందర్యాన్ని సొంతం చేసుకోవచ్చు. అంతేకాదు.. ముఖంపై వున్న మొటిమలను, నల్లటి ఛాయలను, మచ్చలను శాశ్వతంగా దూరం చేసుకోవచ్చు. మరి నిమ్మకాయ రసంతో తయారుచేసుకునే ఆ రెమెడీస్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం...

1. నిమ్మకాయను రెండు భాగాలుగా చేసుకుని, వాటిపై ఉప్పు లేదా పంచదారను అద్దుకోవాలి. దానిని ముఖం మీద సర్కులర్ మోషన్ లో రుద్దాలి. 10 నిముషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.

2. ఒక గిన్నెలో కొద్దిమోతాదులో పెరుగును తీసుకుని, అందులో ఒక చెంచా నిమ్మరసం వేసి కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి మాస్క్’లా వేసుకోవాలి. వారానికి ఒకసారి చేసుకుంటే మంచిది.

3. గుడ్డులోని తెల్లసొనను నిమ్మరసంలో మిక్స చేసి బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి, మెడపై అప్లై చేసుకోవాలి. 15 నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

4. కొద్ది మోతాదులో నిమ్మరసాన్ని తీసుకుని అందులో ఒక చెంచా తేనెను మిక్స్ చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి, అరగంట తర్వాత గురోవెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

5. ఒక కప్పు పాలలో కొద్దిగా నిమ్మరసాన్ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. దీనిని ముఖానికి, మెడకు రాసుకోవాలి. కొద్దిసేపటి తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే.. ముఖంమీదున్న మొటిమలు, మచ్చలు పూర్తిగా మాయమవుతాయి.

6. ఒక గ్లాసులో కొద్దిగా ఆలివ్ ఆయిల్’ని తీసుకుని అందులో కొద్దిగా నిమ్మరసాన్ని జోడించుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించుకుని, 20 నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. దీంతో చర్మం చాలా సాఫ్ట్’గా మారుతుంది.

7. గ్లాసులో కొద్దిగా రోజ్ వాటర్’ను తీసుకుని అందులో ఒక చెంచా నిమ్మరసాన్ని మిక్స్ చేసుకోవాలి. ముఖానికి పట్టించిన అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : lemon juice  beauty tips  health tips  telugu news  

Other Articles

  • Telugu content

    ఇంటా కలబంద.. ఆరోగ్యం మీ చెంత..

    Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more

  • Benefits of badam

    బాదంతో అందం - ఆరోగ్యం

    Oct 23 | నేటి  కాలంలో  మన  జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం  చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more

  • Oninon and lemon are very good for face

    ఉల్లిపాయతో సౌందర్యం..

    Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more

  • Fat reduce drinks beauty tips

    మార్నింగ్ డ్రింక్స్ తో మెరుగైన రూపం..!

    Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more

  • Get glamour with rice cleaning water

    భియ్యం కడిగిన నీళ్లతో అందం

    May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు  వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more