Beauty tips excercise to reduce heavy thighs slim body building

beauty tips, heavy thighs tips, health tips, slim body building tips, telugu news

beauty tips excercise to reduce heavy thighs slim body building

తొడలను సన్నగా మార్చుకునే టిప్స్

Posted: 11/26/2014 04:47 PM IST
Beauty tips excercise to reduce heavy thighs slim body building

ప్రస్తుత యంగ్ జనరేషన్’లో వున్న యూత్ అందరూ తమ శరీరాకృతిని అందంగా మలుచుకోవడానికి నానాతంటాలు పడుతుంటారు. ఎక్కువ లావు కాకుండా జీరో సైజ్ బాడీలను మెయింటెయిన్ చేస్తుంటారు. కడుపుకు అన్నం లేకపోయినా సరే... శరీరాకృతి మాత్రం పాడవకూడదనే నిర్ణయంతో ఎన్నో జాగ్రత్తలు పాటిస్తుంటారు. శరీరాకృతిని సన్నగా మలుచుకోవడం మంచిదేకానీ.. మరీ ఆహారం తీసుకోకుండా వుంటే మాత్రం చాలా ప్రమాదకరమే! ఇక లావుగా వున్నవాళ్లు కూడా అంతే! తాము ఎక్కువగా లావుగా వున్నామనే బాధతో ఇతురుల్లాగే తిండీ, తిప్పలు మానేసి ఏవేవో వ్యాయామాలు చేస్తుంటారు. నిజానికి లావుగా వున్నవాళ్లకు ఆరోగ్య సమస్యలు చాలా వస్తాయి. కాబట్టి పోషక విలువలు కూడిన ఆహారంతో తగిన సూత్రాలను పాటిస్తే లావు తగ్గొచ్చు. ఇక తొడల విషయానికొస్తే.. వాటికి కొన్ని ప్రత్యేకమైన వ్యాయామాలు వుంటాయి. వాటిని తరుచూ పాటిస్తే.. ఎక్కువగా లావు వున్న తొడలను త్వరలోనే తగ్గించుకోవచ్చు. మరి.. ఆ పద్ధతులేంటో చూద్దాం..

1. ముందుగా నిటారుగా నిల్చుని పాదాలను 30 సెంటి మీటర్ల దూరం వుంచుకోవాలి. అనంతరం పిరుదులపైన రెండు చేతులు (బొటనవేళ్ళు ముందుకు ఉండే విధంగా) వుంచుకోవాలి.

2. ఇలా చేసిన తర్వాత ముప్పై సెకనులు పొత్తి కడుపుని క్లాక్’వైస్’గా తిప్పాలి. తర్వాత వ్యతిరేక దిశ(యాంటీక్లాక్ వైజ్)లో ముప్పై సెకనులు తిప్పాలి. ఈ విధంగా ఆరు సార్లు చెయ్యండి. అయితే ఈ వ్యాయమం చేసేటప్పుడు పాదాలు నేలకు సమాంతరంగా ఉండేలా చూసుకోవాలి.

3. కుడి తొడని మీకు సౌకర్యవంతమైన దూరంగా (ముందువైపుకు) ఉంచి మీ పొత్తికడుపును క్లాక్’వైస్’గా ముప్పై సెకనులు తిప్పాలి. తర్వాత వ్యతిరేక దిశలో మరొక ముప్పై సెకనులు తిప్పాలి. అనంతరం పూర్తి చేసాక యథాస్థితికి వచ్చేయొచ్చు.

4. ఇప్పుడు ఎడమ తొడని ముందుకు పెట్టి, పొత్తికడుపును క్లాక్’వైస్’గా ముప్పై సెకనులు తిప్పాలి. అనంతరం వ్యతిరేక దిశలో ముప్పై సెకనులు తిప్పాలి.

5. ఇప్పుడు పాదాలు కదపకుండా మీ పొత్తికడుపుని కుడి వైపు 15 నుండి 20 సెంటి మీటర్లు కదపాలి.

6. శరీరాన్ని ముప్పై సెకనులు క్లాక్’వైస్’గా తిప్పాలి. బాలన్స్ తప్పకుండా జాగ్రత్త వహిస్తూ వ్యతిరేక దిశలో మరొక ముప్పైసెకనులు తిప్పిన అనంతరం పొత్తికడుపుని మధ్యలోకి తీసుకురావాలి.

7. పొత్తికడుపుని ఎడమ వైపుకు కదిపి పైన చెప్పిన విధంగా వ్యాయామం మరోసారి చేయాలి. పూర్తీ చేసాక పొత్తికడుపుని మధ్యలోకి వుంచుకోవాలి.

ఇలా ఈ విధంగా ప్రతిరోజూ మొదటినుంచి చివరి వరకు వ్యాయామం ఆపకుండా చేస్తే.. త్వరలోనే మంచి ఫలితం ఉంటుంది. ఈ వ్యాయామంలో ముఖ్యంగా శరీరాన్ని తిప్పే వ్యాసం మీ శరీర సౌకర్యాన్ని బట్టి ఉండి సాధన చేసే కొద్దీ పెరుగుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : beauty tips  heavy thighs tips  health tips  slim body building tips  telugu news  

Other Articles

  • Telugu content

    ఇంటా కలబంద.. ఆరోగ్యం మీ చెంత..

    Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more

  • Benefits of badam

    బాదంతో అందం - ఆరోగ్యం

    Oct 23 | నేటి  కాలంలో  మన  జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం  చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more

  • Oninon and lemon are very good for face

    ఉల్లిపాయతో సౌందర్యం..

    Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more

  • Fat reduce drinks beauty tips

    మార్నింగ్ డ్రింక్స్ తో మెరుగైన రూపం..!

    Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more

  • Get glamour with rice cleaning water

    భియ్యం కడిగిన నీళ్లతో అందం

    May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు  వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more