Lokesh confident of clean sweep in 2019 elections చిన్నబాబు (లోకేష్) ఆత్యాశకు హద్దు లేదా..?

Minister nara lokesh confident of clean sweep in 2019 elections

AP IT minister, Nara Lokesh, chandrababu naidu, TDP, 175 seats, 2019 assembly elections, pulivendula, YSRCP, YS Jagan, Congress, Andhra pradesh, Politics

Andhra pradesh Information and Technology minister Nara Lokesh confident of winning 175 seats in 2019 assembly elections.

లోకేష్ ప్రకటనతో టీడీపీలో ప్రకంపనలు..?

Posted: 09/08/2017 04:44 PM IST
Minister nara lokesh confident of clean sweep in 2019 elections

అలూ లేదు.. చూలు లేదు కోడుకు పేరు సోమలింగం అన్న సామెత విన్నారా..? అది సరిగ్గా మన మంత్రివర్యులు నారా లోకేష్ కు సరిపోలుతుందన్న కామెంట్లు వినబడుతున్నాయి. ఎందుకంటారా..? 2019 లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అంధ్రప్రదేశ్ లోని అన్ని స్థానాలను తమ పార్టీ విజయం సాధిస్తుందని ఆయన ప్రకటన చేయడమే ఇందుకు కారణంగా నిలుస్తుంది. ప్రతిపక్ష నేత జగన్ ప్రాతినిథ్యం వహిస్తున్న పులివెందుల సహా అన్ని స్థానాలను తాము విజయకేతనం ఎగురవేస్తామని ఆయన ధీమాను వ్యక్తం చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

మీడియాతో మాట్లాడిన మంత్రి.. మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరును సీఎం ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారని దాని ఫలితంగానే తాము రానున్న ఎన్నికలలో అన్ని స్థానాలను కైవసం చేసుకుంటామని మంత్రి వివరించారు. అంతటితో అగని మంత్రివర్యులు.. సక్రమంగా పనిచేసేవారికే.. మరోలా చెప్పాలంటే గెలుపుగుర్రాలకే వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం చేపడుతు్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలు ఆదరిస్తున్నారని చెప్పారు. పులివెందులలో కూడా వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా తామే గెలుస్తామని లోకేష్ ధీమా వ్యక్తం చేశారు.

ఇంతవరకు బాగానే వున్నా 2019 అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా దాదాపు 19 నుంచి 20 నెలల సమయం వుంది. ఎన్నికలనగానే గెలుపు గుర్రాలకే టిక్కెట్లు ఇవ్వడమే కాదు.. వారికి స్థానిక ప్రజామోదం కూడా వుండాలి. అలాంటి వారికి టికెట్లు ఇస్తేనే విజయం సాధిస్తారు. అయితే మంత్రి లోకేష్ ప్రకటన నేపథ్యంలో ఇప్పుడే ఎక్కడెక్కడ ఎవరెవరికీ టిక్కెట్లను ఇవ్వాలో కూడా టీడీపీ నిర్ణయించేసిందా..? అన్న సందేహాలు కూడా తెరపైకి వస్తున్నాయి. ఈ సారైనా తమకు టికెట్ లభిస్తుందా.. అని అశించే వారిలో ఉత్కంఠకు తేరలేచింది.

అయితే తమ పార్టీలోకి వలస వచ్చిన నేతలకు పార్టీ టికెట్లు ఇస్తారా..? లేక పార్టీతోనే వున్న నేతలకు టికెట్లు ఇస్తారా..? అన్నది విషయంలోనూ టీడీపీ నేతలు ఇప్పటి నుంచే అందోళన కలుగుతుంది. ఇక సిట్టింగ్ ఎమ్మెల్యేలకు అవకాశం ఇవ్వకుండా గెలుపు గుర్రాలన్న పేరుతో తమను కాదని ఇతరులకు టికెట్ ఇస్తున్నారా..? అన్న అనుమానాలు టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలలో ప్రకంపనలకు దారితీస్తుంది. ఇదిలావుంటే గత ఎన్నికలలో జాతీయ పార్టీ బీజేపితో కలసి పోటీచేసినా.. ఓటమి అంచుల్లోనే నిలచిన టీడీపీకి.. ఈ సారి ఎన్నికలలో 175 స్థానాలు దక్కడమంటే అతిశయోక్తేనని మరికోందరు కామెంట్ చేస్తున్నారు.

గత ఎన్నికలలో జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాన్ చివరి పక్షం రోజుల్లో టీడీపీకి ఓటు వేయాలని చేసిన ముమ్మర ప్రచారం చేయడమే వారిని అధికారంలో కూర్చునేలా చేసిందన్న విషయాన్ని తెలుసుకోవాలని, ఇటు బీజేపి, అటు జనసేన కలస్తేనా కొద్ది తేడాతో గట్టుకు చేరిన టీడీపీ.. ఇప్పుడు బీరాలకు పోవడం తగదని వ్యాఖ్యానిస్తున్నారు. ఇక రానున్న ఎన్నికలలో అటు బీజేపితో కానీ, ఇటు జనసేనతో కానీ కలసి ఎన్నికలలో పోటీ చేస్తారా..? లేక ఒంటిరిగానే బరిలోకి దిగుతారా..? అన్న విషయంలోనూ క్లారిటీ లేకుండా.. 175 స్థానాలు తాము సాధిస్తామని ప్రకటన చేయడం.. టీడీపీ దుందుడకు చర్యగా రాజకీయ విశ్లేషకులు పరిగణిస్తున్నారు.

ఇక మంత్రి నారాలోకేష్ ప్రకటనపై మరికోందరు విఫక్ష పార్టీల శ్రేణులు స్పందిస్తూ.. లోకేష్ అత్యాశకు హద్దు లేదా..? అని విమర్శలు గుప్పిస్తున్నారు. అవకాశమిస్తే యావత్ భారత దేశంలోనూ టీడీపీపి పార్టీని అధికారంలోకి తీసుకువస్తామని నారా లోకేష్ బీరాలకు పోతారని కూడా విమర్శలు వస్తున్నాయి. ఓటుకు నోటు కేసులో ఒక్క ఓటుకు ఐదు కోట్ల రూపాయలను పంచేందుకు సిద్దమైన టీడీపీ.. నంద్యాల ఉపఎన్నిక, కాకినాడ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలలోనూ అదే పనిచేసి అధికారంలోకి వచ్చిందన్న విషయం అంధ్రప్రజలందరికీ తెలుసునని విమర్శలు గుప్పిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles