మెగా క్యాంప్ సాయం కోరనున్న జగన్? | Jagan Seeks Mega Family Help for 2019 Elections,

Jagan seeks janasena help for 2019 elections

Pawan Kalyan, YS Jagan Mohan Reddy, 2019 Andhra Pradesh Elections, Chiranjeevi, YS Jagan Janasena, Chiru Pawan and YS Jagan

YSR Congress Chief YS Jagan Mohan Reddy seeks Chiranjeevi and Pawan kalyan help for 2019 Elections.

2019 ఎన్నికల కోసం పవన్, చిరు సాయం?

Posted: 09/11/2017 06:42 PM IST
Jagan seeks janasena help for 2019 elections

వరుసగా రెండు దారుణ ఓటములతో 2019 ఎన్నికలపై ఇప్పటి నుంచే ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. అయితే పార్టీ అధినేత వైఎస్ జగనోహ్మన్ రెడ్డి మాత్రం కేడర్ లో మనోధైర్యం నింపే యత్నం చేస్తున్నాడు. ఇదిలా ఉంటే ఓ టీవీ ఛానెల్ డిబెట్ నుంచి మొదలైన ఓ వార్త ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది.

నంద్యాల ఉపఎన్నిక‌లు, కాకినాడ కార్పోరేష‌న్‌ ఎన్నిక‌ల ఫ‌లితం దెబ్బ‌తో పార్టీని ప‌టిష్టం చేసేందుకు వైఎస్సార్‌సీపీ అధినేత జ‌గ‌న్ కొత్త వ్యూహాలు ర‌చిస్తున్న‌ట్లు తెలుస్తోంది. 2019 ఎన్నిక‌ల్లో ఎలాగైనా విజ‌యం సాధించేందుకు వ్యూహాల‌ను సూచించాల‌ని ఇటీవ‌ల త‌మ పార్టీ రాజ‌కీయ నిపుణుడు ప్ర‌శాంత్ కిషోర్‌ని కోరిన‌ట్లు సమాచారం. అందుకు తగ్గట్లే ప్రశాంత్ కూడా ఓ సలహా ఇచ్చినట్లు కథనాలు చెబుతున్నాయి. అందులో భాగంగా త్వ‌ర‌లో త‌మ పార్టీకి మెగాస్టార్ చిరంజీవి, ప‌వ‌న్ క‌ల్యాణ్‌ల మ‌ద్ద‌తు కోర‌నున్న‌ట్లు చెబుతున్నారు.

ఓవైపు జనసేనవతో వచ్చే ఎన్నికల్లో పరిమిత స్థానాల్లో పోటీ చేయనున్న పవన్.. కాంగ్రెస్ లో పెద్దగా ప్రభావం చూపకపోయినా.. కాపు నేతల లిస్ట్ లో ప్రముఖంగా చిరంజీవి సాయం కోరటం ద్వారా వచ్చే ఎన్నికల్లో టీడీపీని ధీటుగా ఎదుర్కొవచ్చనే ప్రశాంత్ జగన్ కు సూచించినట్లు చెబుతున్నారు.  అయితే రాజకీయాల్లో విభిన్న ధృవాలుగా ఉన్న చిరు-పవన్ లు జగన్ కోసం ఏకమవుతారన్న వార్త హుళక్కే అని చెప్పుకోవాలి. కాపు రిజర్వేషన్ల అంశంలో కూడా వీరిద్దరు బయటి నుంచి మద్ధతు ఇచ్చే అవకాశం ఉన్నా.. కలయిక మాత్రం జరగకపోవచ్చనే విశ్లేషకులు చెబుతున్నారు. అయితే పార్టీకార్య‌క‌ర్త‌ల‌తో స‌మావేశం ఏర్ప‌రచి విస్తృత స్థాయిలో ప్రచారంపై అవగాహన కల్పించే అంశం మాత్రం కొట్టిపారేయలేమని వారంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles