Cabinet reshuffle shows nobody knows what Modi will do next

Modi next step can t guess

Prime Minister Narendra Modi, Cabinet Reshuffle, Modi Next Step, Narendra Modi Twists

Weak governments leak all the time. During UPA II, everybody, from the PMO to the CAG to the lowliest junior minister, leaked. It is a mark of the strength of the Modi government that nothing ever gets out — unless he wants it to.Cabinet reshuffle shows nobody knows what Modi will do next

మోదీ నిర్ణయాలను ఊహించలేం!

Posted: 09/04/2017 05:18 PM IST
Modi next step can t guess

బలహీన ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా.. ఇట్టే బయటకి వచ్చేస్తాయి. దానికి మంచి ఉదాహరణ యూపీఏ-2 ప్రభుత్వం. తామేదో ఘనత సాధించబోతున్నామన్న హింట్ ఇచ్చేస్తూ అభివృద్ధి విషయంలో కీలక నేతలతో ముందస్తుగానే కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం గొప్పలకు పోయింది. అయితే అంత ఆసక్తిమేర నిర్ణయాలేవీ యూపీఏ తీసుకోలేదన్న విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే ఇప్పుడున్న అధికార ప్రభుత్వం అందుకు పూర్తి విరుద్ధం. నోట్ల రద్దు దగ్గరి నుంచి సర్జికల్ స్ట్నైక్.. జీఎస్టీ ఇలా అన్ని సగటు భారతీయులు ఊహించలేని ట్విస్ట్ లే. ఇప్పుడు కేబినెట్ విషయంలోనూ అదే సస్పెన్స్ ను మెయింటెన్ చేసి సక్సెస్ అయ్యాడు ప్రధాని మోదీ. అయితే కొంత కాలంగా మీడియాలో మిత్రపక్షం జేడీయూ, అన్నాడీఎంకేలకు బెర్తులు తప్పవనే వార్తలు జోరుగా ప్రచారం అయ్యాయి. కానీ, ఎవరి ఊహకు అందకుండా ఒక్కరికి కూడా సీట్ కేటాయించకుండా బ్యూరోక్రట్లకు స్థానం కల్పించి ఆశ్చర్యానికి గురి చేశాడు.

ఇక ప్రధాని నరేంద్రమోదీ ఓవరాల్ గా కొత్త కేబినెట్‌లో పదిశాతం మంది అధికారులకు చోటు లభించింది. దీంతో కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ తర్వాత మంత్రుల సంఖ్య 76కు చేరుకుంది. మాజీ హోం కార్యదర్శి, రిటైర్డ్ దౌత్యవేత్త, ముంబై మాజీ పోలీస్ కమిషనర్, మంత్రి పదవులు దక్కించుకున్న వారిలో ఉన్నారు. కేబినెట్‌లో చోటు దక్కించుకున్న వారిలో మాజీ బ్యూరోక్రాట్లు రాజ్‌కుమార్ సింగ్, హర్దీప్ పూరీ, సత్యపాల్ సింగ్, అల్ఫోన్స్ కన్నన్‌థానమ్ ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు.

ముంబై కమీషనర్ గా పని చేసి మాఫియాను గడగడలాడించిన ఆర్కే సింగ్, ఢిల్లీ అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపిన ఆల్ఫోన్స్, సత్యపాల్ సింగ్ ఏకంగా అద్వానీనే జైలుకు పంపటం(రథయాత్ర సమయంలో).. సమర్థవంతమైన అవినీతిరహిత అధికారులుగా పేరుండటం, పైగా వీరిలోఇలా చాలా ప్రత్యేకతలను సంతరించుకుంది. ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలన్నా, లేదా నిర్ణయాలను సమర్థవంతంగా తీసుకోవాలన్నా.. వాటిని సమీక్షించాలన్న అనుభవం ఉన్న అదికారులనే తీసుకోవాలన్న నిర్ణయం ప్రశంసనించదగ్గది. 

దీనివెనుక కేబినెట్ తాజా కూర్పు చూస్తుంటే 2019 ఎన్నికల వ్యూహం ఉందనేది రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట. కానీ, మోదీ తర్వాత నిర్ణయం ఎలా ఉండబోతుందన్నది మాత్రం మీడియా కాదుగా.. ఎవరూ ఊహించలేని ట్విస్టే అవుతుంది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : PM Narendra Modi  Cabinet Reshuffle  Next Decision  

Other Articles