Union Urban Development Minister Venkaiah Naidu Makes Controversial Comments On Congress Party | BJP Party Updates

Venkaiah naidu controversial comments on congress party

venkaiah naidu, bjp party news, congress party updates, congress party controversies, venkaiah naidu press meets, venkaiah naidu controversies, central government, congress latest updates

Venkaiah Naidu Controversial Comments On Congress Party : Union Urban Development Minister Venkaiah Naidu Makes Controversial Comments On Congress Party.

కాంగ్రెస్ కు ఆ అవగాహన లేదు : వెంకయ్య

Posted: 09/18/2015 06:51 PM IST
Venkaiah naidu controversial comments on congress party

కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు మరోమారు విపక్ష కాంగ్రెస్ పై విమర్శల వర్షం కురిపించారు. బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ కాంగ్రెస్ పై ఆయన నిప్పులు చెరుగుతున్న విషయం తెలిసిందే! కాంగ్రెస్ అధికారంలో వున్నప్పుడు ఆ పార్టీ చేసిన తప్పులు, స్కాములు, ఇతర వ్యవహారాలపై వెంకయ్య చాలా సందర్భాల్లో ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ‘భూసేకరణ’ చట్టంపై కాంగ్రెస్ పార్టీ చేసిన సంచలన వ్యాఖ్యలకు వెంకయ్య తనదైన శైలిలో కౌంటర్లు వేశారు.

ఈ నేపథ్యంలో వెంకయ్య కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పిస్తూ.. గతంలో ఆ పార్టీ చేసిన తప్పులను తమపై రుద్దుతోందని ఘాటుగా స్పందించారు. భూసేకరణ చట్టంపై అనవసర రాద్ధాంతం చేస్తున్న కాంగ్రెస్ నేతలకు అసలు ఆ చట్టంపై అవగాహనే లేదని ఆయన తేల్చిచెప్పారు. కాంగ్రెస్ అధికారంలో వున్నప్పుడు రైతులకు ఎంతో అన్యాయం చేసిందని.. ఆ తప్పులను కప్పిపుచ్చుకునే ఆ పార్టీ నేతలు తమ ప్రభుత్వంపై లేనిపోని నిందలు వేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. తమ ప్రభుత్వం చేపట్టిన భూసేకరణ చట్టం వల్ల రైతుల కష్టాలు తీరడంతోపాటు మరెన్నో ప్రయోజనాలు కలుగుతాయని అన్నారు. ఎప్పటికైనా వాస్తవాలను ఒప్పుకుని తీరాల్సిందేనని ఆయన వ్యాఖ్యానించారు.

తమ సొంత స్వలాభాల కోసం కాంగ్రెస్ ప్రజలకు ఏమాత్రం పట్టించుకోకుండా ఎన్నో తప్పులు చేసినప్పటికీ.. తమ ప్రభుత్వంపై నిందలు వేస్తున్నందుకు సిగ్గు పడాలని వెంకయ్య అన్నారు. ఈ విధంగా వెంకయ్య చేసిన కామెంట్లపై కాంగ్రెస్ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : venkaiah naidu  bjp party updates  congress party updates  

Other Articles

  • Trs and grand alliance parties are branches of one tree alleges gvl

    ప్రజాకూటమి- టీఆర్ఎస్ ఒకే టాను ముక్కలు

    Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more

  • Telangana deceiver cbn in congress led grand alliance alleges kcr

    తెలంగాణ ద్రోహితో కూటమా.?: కేసీఆర్

    Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more

  • Cm kcr on defections to trs

    రాజకీయ సుస్థిరత కోసమే సభ్యులను కలుపుకున్నాం : కేసీఆర్

    Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more

  • Kamal haasan on periyar statue vandalism

    విగ్రహాలను మేం కాపాడుకోగలం : కమల్ హాసన్

    Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more

  • Ysrcp adi sheshagiri rao comments on cbn

    చంద్రబాబు మాటలు అదుపు తప్పుతున్నాయ్ : వైసీపీ ఆదిశేషగిరిరావు

    Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more