pawan kalyan he entered politics for change మార్పు కోసమే రాజకీయాల్లోకి వచ్చా: పవన్ కల్యాణ్

Pawan kalyan he entered politics for change at rajamundry public meet

pawan kalyan, janasena, rajamundry, rajamahedravaram, janasena fifth foundation day, janasena formation day, janasena activists, assembly candidates first list, janasena assembly candidates first list,stratagic selection, jana sena contestants, andhra pradesh election 2019, andhra pradesh, politics

Actor turned Politician Power Star Pawan Kalyan says he entered into politics for change, which every one welcomes.

రాష్ట్ర ప్రజల పాతికేళ్ల భవిష్యత్తు కోసమే రాజకీయాల్లోకి : పవన్ కల్యాణ్

Posted: 03/14/2019 06:37 PM IST
Pawan kalyan he entered politics for change at rajamundry public meet

రాజకీయాల్లోకి రావాలంటే.. ఎలాంటి అర్హతలు లేకున్నా సరే, డబ్బులుంటే చాలనే దౌర్భాగ్య పరిస్థితి ప్రస్తుతం దేశంలో ఏర్పడిందని జనసేనాని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. తాను రాష్ట్రం సుస్థిరంగా వుండాలని కోరుకునే వ్యక్తిగా, ప్రజలకు ఎలాంటి కష్టనష్టాలకు గురికావద్దని 2014లో ఏమీ ఆశించకుండానే టీడీపీ, బీజేపీకి అండగా ఉన్నానని పవన్ తెలిపారు. 2014లో జనసేన పార్టీని ఏర్పాటు చేసినప్పుడు ఆ సభలో తాను ఏదైనా తప్పు మాట్లాడితే దాడి చేద్దామని కూడా పలువురు కాచుకున్నారని పవన్ చెప్పారు.

రాజమండ్రిలో జరిగిన జనసేన పార్టీ 5వ ఆవిర్భావ సభలో లక్షలాదిగా హాజరైన అభిమానులు, జనసైనికుల సాక్షిగా ప్రసంగించిన పవన్ కళ్యాణ్.. తన వద్ద లేవ కోట్ల రూపాయలు లేవని.. టీవీ ఛానళ్లు, పేపర్లు లేవని అన్నారు. తాను ముఖ్యమంత్రి కొడుకును అంతకన్నా కాదన్నారు. అయితే ఇవి లేకపోతే రాజకీయాల్లోకి రాకూడదా..? అని ప్రశ్నించారు. తాను ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చానని, కోట్ల రూపాయలు వచ్చే భవిష్యత్తును వదులుకుని ప్రజల కోసం నడుద్దమాని మార్పు కావాలని వచ్చానన్నారు.

పాతికేళ్ల భవిష్యత్తును వదిలేసి.. తనకు అండగా నిలిచిన యువత కోసం.. రాష్ట్ర ప్రజల కోసం వారి పాతికేళ్ల బంగారు భవిష్యత్తు కోసం రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు. తాను జనసేన పార్టీని స్థాపించిన 2014లో ఒక్కటే నమ్మాను. సమాజం మారాలి, వ్యవస్థ మారాలి, మార్పు రావాలి. తనలాగే మార్పు కోరుకున్న వారికి నా మాటలు అర్థం అవుతాయని నమ్మానని పవన్ అన్నారు. తాను ‘సత్యమేవ జయతే’ నినాదాన్ని నమ్ముకున్నానని తెలిపారు. మార్పు తాను మాత్రమే కోరుకుంటే రాదని పవన్ అన్నారు.

ఈ సందర్బంగా తన  చిన్నతనంలో తన సోదరుడు నాగబాబు చెప్పిన మాటను ఊటంకించ్చారు. మార్పు రావడానికి.. సమాజంలో గర్భధారణ పరిస్థితులుంటే, నాయకుడొచ్చి మంత్రసాని పని చేస్తాడని లెనిన్ చెప్పారట. మీరు మార్పు రావాలని కోరుకుంటున్నారు. నేనేదో గొప్ప పని చేస్తున్నానని భావించట్లేదు. కాలానుగుణంగా మార్పులొస్తాయని పవన్ అన్నారు. అడుగు వేస్తే తల తెగిపోవాలే కానీ, మడమ తిప్పనని ఆయన స్పష్టం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  janasena  fifth formation day  rajamahendravarm  andhra pradesh  politics  

Other Articles