pawan kalyan requests kcr to leave ap politics దండం పెడతా.. ఆంధ్రులను వదిలేయండి కేసీఆర్: పవన్

Pawan kalyan requests kcr not to interfer in andhra pradesh politics

pawan kalyan, janasena, rajamundry, janasena maఆnifesto,Telanagan CM KCR, rajamahedravaram, janasena fifth foundation day, janasena formation day, janasena activists, assembly candidates first list, janasena assembly candidates first list,stratagic selection, jana sena contestants, andhra pradesh election 2019, andhra pradesh, politics

Actor turned Politician Power Star Pawan Kalyan says andhra pradesh is a decieved state by partition, and requests Telangana CM KCR not to interfere in ap politics, even if there are small differences between the politicians.

దండం పెడతా.. ఆంధ్రులను వదిలేయండి కేసీఆర్: పవన్

Posted: 03/14/2019 07:28 PM IST
Pawan kalyan requests kcr not to interfer in andhra pradesh politics

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జోక్యం చేసుకోవద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో పార్టీల మధ్య విబేధాలు ఉంటాయని, అంతమాత్రన అందులో వేలు పట్టొద్దని పవన్ కల్యాణ్ కోరారు. ‘కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే దెబ్బతిన్న రాష్ట్రం. మళ్లీ అందులో వేలుపెట్టొద్దు. ఏవో చిన్నపాటి గొడవలు ఉంటాయి. అంతమాత్రన మీరు రాష్ట్రంలోకి వచ్చి మళ్లీ పాతగొడవలు లేపొద్దు. మానుతున్న గాయాలను వదిలేయండీ, దయచేసి ఆంధ్రులను వదిలేయండి. మీకు దండంపెడతా.’ అని పవన్ కళ్యాణ్ అన్నారు.

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కంటే తనకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రధాని నరేంద్రమోదీలతో ఎక్కువ పరిచయం ఉందని అన్నారు. అయితే, వారికి తాను దూరం జరిగితే జగన్ మోహన్ రెడ్డి వెళ్లి వారితో స్నేహం చేయడం సరికాదని పవన్ కల్యాణ్ అన్నారు. ‘బీజేపీ మనల్ని బాగా దెబ్బకొట్టింది. మనం బీజేపీకి భుజం మోస్తే ఆ పార్టీ దొడ్డిదారిలో వైసీపీకి అండగా నిలుస్తోంది. బీజేపీతో స్నేహంపై వైసీపీ తన వైఖరి స్పష్టం చేయాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు.

కేసీఆర్ తనకు కావాల్సిన వ్యక్తని.. అలాగే.. హరీశ్ రావు కూడా కావాల్సిన వ్యక్తి. అయితే, రాష్ట్ర ప్రయోజనాల కోసం తాను వారితో కలిసి లేనని అన్నారు. ప్రస్తుతం ఎన్నికల బరిలో తన పార్టీతో పాటు అటు టీడీపీ, ఇటు వైసీపీలు పోటీ చేస్తున్నాయని, తనతో పాటుగా ఎన్నికల రణక్షేత్రంలో చంద్రబాబు, జగన్ ముగ్గురం పోటీలో వున్నామని అన్నారు. ఇంతవరకే దీనిని పరిమితం చేద్దామని అన్న పవన్... ఛీకొట్టిన తెలంగాణ నాయకులను ఏపీకి తేవొద్దని జగన్ కు సూచించారు.

ఆంధ్రుల అభిమానం దెబ్బతీసిన వ్యక్తితో కలసి ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని ఎలా కాపాడగలరు?’ అని పవన్ కల్యాణ్.. వైఎస్ జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు  మీద కూడా పవన్ కళ్యాణ్ విమర్శలు గుప్పించారు. ‘పదే పదే మాటలు మార్చినందుకు చంద్రబాబు పశ్చాత్తాపపడాలన్నారు. ప్రజలకు క్షమాపణ చెప్పాలి. స్వార్థం కోసం రాష్ట్రాన్ని బలిచేయొద్దని సూచించారు జనసేనాని పవన్ కల్యాణ్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  janasena  Telanagan CM KCR  fifth formation day  andhra pradesh  politics  

Other Articles