kakinada city janasena activists in full josh యుద్దం చేయడమే తెలుసు: పవన్ కల్యాణ్

Janasena formation day pawan kalyan says his never leaves battle field

pawan kalyan, janasena, rajamundry, rajamahedravaram, janasena fifth foundation day, janasena formation day, janasena activists, assembly candidates first list, janasena assembly candidates first list,stratagic selection, jana sena contestants, andhra pradesh election 2019, andhra pradesh, politics

Actor turned Politician Power Star Pawan Kalyan headed political party Janasena completes five Years and enters into sixth year. This year is very crusial for JSP as its entering the Democratic battle feild for the first time.

ముఖ్యమంత్రి పీఠం పదవి కాదు బాధ్యత: పవన్ కల్యాణ్

Posted: 03/14/2019 05:59 PM IST
Janasena formation day pawan kalyan says his never leaves battle field

తెలుగు ప్రజల సుస్థిరత కోసం ఏర్పాడిన పార్టీయ జనసేన పార్టీ అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. సమాజం మారాలి, వ్యవస్త మారాలి, మార్పు రావాలన్న ఆకాంక్షతోనే తాను పార్టీని స్థాపించానని చెప్పారు. ఆశయాలు వున్నవారు రాజకీయాల్లో పనికిరారని, వేల కోట్ల రూపాయలు వున్నావారే రాజకీయాల్లో వుండాలని అధిపత్యం కనబరుస్తూ శాసిస్తున్నారని ఆయన అవేదన వ్యక్తం చేశారు. రాజకీయాల్లో డబ్బు సంపాదించడం తుచ్చమైన వ్యవహరామని అన్నారు. తాను చూడని కోట్లు కాదు.. తాను వదిలేసిన కోట్ల రూపాయలు లేవని అన్నారు.

అయితే కోట్ల రూపాయల డబ్బులు తనకు సంతోషాన్ని ఇవ్వలేదన్నారు. పవర్ స్టార్ అని అభిమానులు ఇచ్చిన పేరు కూడా తనకు ఆనందాన్ని పంచలేక పోయిందన్నారు. తాను తనవాళ్లకు సాయం చేయడంతో తనకు సంతృప్తి కలిగిందని, ఎవరికైనా అన్యాయం జరిగితే ఎదురెత్తి గళం తనకుందని అన్నారు. ఎవరికి అన్యాయం జరిగినా చూస్తూ ఉరుకునే వ్యక్తిని కాదని అన్నారు. బాధితులకు న్యాయ జరిగినప్పుడే తనకు సంతోషం కలిగిందన్నారు.

ఇక తాజాగా పవన్ పక్కన కేవలం టీనేజ్ యువత, మాత్రమే వున్నారని అంటున్నారు. వాళ్లు సీఎం సీఎం అంటూ అరిస్తే.. ఎలా గెలిచి సీఎం అయిపోతారని కూడా ప్రశ్నిస్తున్నారని.. యువత తలచుకుంటే సాథ్యం కానిదంటూ ఏమీ లేదని పవన్ అన్నారు. అయినా తనకు యుద్దం చేయడం ఒక్కటే తెలుసునని, గెలుపోటములు గురించి అలోచించే వ్యక్తికి కానన్నారు. తనను పల్లకీలు మోసేందుకు ఉపయోగించుకున్నా.. ప్రజలు ప్రశాంతంగా వుండాలని తాను కొంతకాలం పల్లకీలు మోసానని అన్నారు. ఇక తనకు ముఖ్యమంత్రి పీఠం పదవి కాదని, బాధ్యత అని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  janasena  fifth formation day  rajamahendravarm  andhra pradesh  politics  

Other Articles