sabitha reddy takes U turn again, to join TRS టీఆర్ఎస్ లో చేరనున్న సబితారెడ్డి.. ఫలించని రేవంత్ దౌత్యం

Sabitha reddy takes u turn again to join trs

P. Sabita reddy, P karthik reddy, Revanth Reddy, Telanagana senior congress leader, Rahul Gandhi, Congress President, AICC, Telangana, General Elections 2019, Lok sabha Elections, Chevella loksabha, shashidhar reddy, Politics

In view of his son P.karthik reddy political career, Telangana senior leader, former minister sabitha reddy decides to join Ruling TRS party, which is ready to announce her son karthik reddy as chevella contestant.

టీఆర్ఎస్ లో చేరనున్న సబితారెడ్డి.. ఫలించని రేవంత్ దౌత్యం

Posted: 03/12/2019 08:24 PM IST
Sabitha reddy takes u turn again to join trs

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి మరోమారు యూటర్న్ తీసుకున్నారు. టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లటం రమారమి ఖారారు చేసుకున్న చేవెళ్ల చెల్లమ్మ.. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఫోన్ తో టీఆర్ఎస్ లోకి వెళ్లడంపై వెనక్కు తగ్గారు. ఆ తరువాత ఇవాళ మధ్యాహ్నం మరోమారు తన అనుచరులతో సమావేశమైన తరువాత.. అమె తన స్టాండును మార్చుకున్నారు. ఇక ఎవరెంత చెప్పినా.. తన తనయుడి రాజకీయ భవిష్యత్తే ముఖ్యమని అమె అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకున్నారు.


చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గం నుంచి తన తనయుడు కార్తీక్ రెడ్డిని బరిలోకి దింపాలని భావించిన అమె.. ఈ విషయంలో ఇంద్రారెడ్డి అభిమానులు, కార్తీక్ రెడ్డి శ్రేయోభిలాషులతో పాటు తన అనుచరులతో కూడా సమావేశమై చర్చలు నిర్వహించారు. కార్తీక్ రెడ్డికి చేవెళ్ల ఎంపీ టికెట్ ఇవ్వడంతో పాటు టీఆర్ఎస్ ప్రభుత్వంలో తొలి మహిళా అమాత్యురాలిగా అమె చేత త్వరలోనే ప్రమాణం చేయించే హామీని కల్పించడంతో సబితారెడ్డి అధికార పార్టీ తీర్థం తీసుకోనున్నారు.

కుమారుడు కార్తీక్‌తోపాటు బుధవారం టీఆర్‌ఎస్ పార్టీలో ఆమె చేరనున్నారు. సబిత టీఆర్ఎస్ లో చేరతారని కొన్ని రోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రేవంత్ రెడ్డి అమెతో చర్చలు జరిపారు. అయితే ఆయన దౌత్యం మేరకు వెనక్కి తగ్గిన సబితారెడ్డి.. కాంగ్రెస్ పార్టీ నుంచి కార్తీక్ రెడ్డికి చేవెళ్ల ఎంపీ సీటు విషయంలో స్పష్టమైన హామీ రాకపోవడంతో.. ఇక అధికార పార్టీ కండువా కప్పుకునేందుకు రెడ్డీ అయ్యారు. రేవంత్ రెడ్డి దౌత్యం కూడా విఫలం చెందడంతో.. ఆయన ఢిల్లీ పెద్దలను ఎలా ఎదుర్కోవాలనే విషయమై సంధిగ్ధంలో పడినట్లు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : P. Sabita reddy  P karthik reddy  Revanth Reddy  Rahul Gandhi  Lok sabha Elections  Politics  

Other Articles