Three months skectch for Pranay's murderప్రణయ్ హత్యకు భారీ కుట్ర: ఎస్పీ రంగనాథ్

Three months skectch for pranay s murder nalgonda sp

pranay murder case, maruthi rao, subash sharma, mahmmad bari, aszar ali, shravan, congress leader, abdul kareem, shravan, amrutha varshini, Nakrekal MLA, Vemula Veeresham, miryalaguda, crime

Nalgonda SP Ranganath has revealed the details of Sensational Honour killing of Perumalla Pranay at Miryalaguda Hospital, said there are total of 7 members involvement in the case.

ప్రణయ్ హత్యకు మూడు నెలల నుంచే స్కెచ్: ఎస్పీ రంగనాథ్

Posted: 09/18/2018 05:33 PM IST
Three months skectch for pranay s murder nalgonda sp

తెలుగు రాష్ట్రాలలో పెను సంచలనం సృష్టించిన పెరుమాళ్ల ప్రణయ్ పరువుహత్య కేసులో రాజకీయ నేతల జోక్యం ఎక్కువైందన్న వార్తలు వినిపిస్తున్న క్రమంలో పోలీసులు కూడా ఈ కేసును శరవేగంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో హతుడు ప్రణయ్ ను అత్యంత కిరాతకంగా నరికి చంపిన హంతకుడిని గుర్తించిన పోలీసులు.. బీహార్ లో అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 12న అసుపత్రికి వచ్చిన చెక్ అప్ చేయించుకుని ఇంటికి తిరిగివెళ్తున్న క్రమంలో వెనకగా వచ్చిన అగంతకుడు అతనిని వెనుకగా వచ్చి హతమార్చిన విషయం తెలిసిందే.

అమృత తండ్రి మారుతీరావు నుంచి సుపారీ తీసుకుని ప్రణయ్ ను హతమార్చిన అగంతకుడిని సుభాష్ శర్మగా గుర్తించిన పోలీసులు. ఇతను బీహార్ కు చెందిన వ్యక్తిగా కూడా తెలుసుకున్నారు. ప్రణయ్ ను హతమార్చిన వెంటనే మిర్యాలగూడ నుంచి బీహార్ కు పారిపోయిన హంతకుడిని.. నల్గొండ నుంచి వెళ్లిన పోలీసులు బీహార్ లోని సమస్తిపూర్ జిల్లాలో అతడిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అతనిని బీహార్ నుంచి నల్గొండకు తరలిస్తున్నారు. కాగా ఈ కేసు విషయమై మీడియాతో మాట్లాడిన నల్డొండ ఎస్పీ రంగనాథ్ పలు అసక్తికర విషయాలను తెలిపారు.

కంటికిరెప్పలా చూసుకుంటూ పెంచుకున్న బిడ్డ, తనను కాదని మరో యువకుడితో వెళ్లిపోయిన నేపథ్యంలో, బిడ్డపై ఉన్న అతి ప్రేమ, ఆమె తనకు కావాలన్న బలమైన కోరికతోనే అమృత వర్షిణి భర్త ప్రణయ్ ను హత్య చేయించాలని మారుతీరావు భారీ కుట్రకు పాల్పడ్డాడని తెలిపారు. ఈ దారుణానికి మూడు నెలల నుంచే మారుతిరావు స్కెచ్ వేశారని కూడా తెలిపారు. ఈ కేసులో ఏ1 నిందితుడు మారుతీరావు కాగా, ఏ 2 మాత్రం సుబాష్ శర్మ అని అన్నారు. ఈ కేసులో మరో ఏడుగురు నిందితులు ఉన్నారని తెలిపిన ఎస్పీ వారిని.. మీడియా ముందు హాజరు పర్చారు. హత్య చేస్తే రూ. కోటి రూపాయలు ఇచ్చేలా డీల్ మాట్లాడుకున్న మారుతీరావు, అడ్వాన్సుగా రూ. 18 లక్షలు ఇచ్చాడని తెలిపారు.

జూలై మొదటి వారంలోనే నిందితులు ప్రణయ్ హత్యకు స్కెచ్ వేశారని చెప్పారు. మారుతీరావు నుంచి రూ. 15 లక్షలు అడ్వాన్స్ తీసుకున్న తర్వాత అస్గర్ అలీ, అబ్దుల్ బారీ స్కెచ్ వేశారని తెలిపారు. ఈ మొత్తంలో రూ. 8 లక్షలు బారీ, రూ. 6 లక్షలు అస్గర్, లక్ష రూపాయలు కరీం తీసుకున్నారని వెల్లడించారు. మర్డర్ ప్లాన్ అమలుకు మూడు సిమ్ కార్డులు కొన్నారని చెప్పారు. కోటి రూపాయలకు డీల్ కుదిరిందని తెలిపారు. గతంలో రెండు సార్లు మర్డర్ ప్లాన్ వేశారని... ఆగస్ట్ 17న వెడ్డింగ్ రిసెష్పన్ ను కూడా టార్గెట్ చేశారని ఎస్పీ చెప్పారు.

బీహర్ కు చెందిన సుభాష్ శర్మ ప్రణయ్ ను హత్య చేశాడని తెలిపారు. ఈ కేసులో ఏ1గా అమృత తండ్రి మారుతీరావు, ఏ2గా సుభాష్ శర్మను నమోదు చేశామని చెప్పారు. మొత్తం ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. తన కుమార్తకు బిడ్డ పుడితే అవమానమని మారుతీరావు భావించారని... అబార్షన్ చేయించుకోవాలని ఆమెపై ఒత్తిడి కూడా తీసుకొచ్చారని చెప్పారు. ప్రణయ్ తల్లిదండ్రులతో మారుతీరావుకు పలుమార్లు గొవడ అయిందని... మారుతీరావు నుంచి ప్రాణహాని ఉండటంతో, వారు ఇంట్లో సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసుకున్నారని తెలిపారు.

అవతలి వ్యక్తి ధనవంతుడు కావడం వల్లే, హత్య చేసేందుకు సుపారీ గ్యాంగ్ ఇంత భారీ మొత్తాన్ని డిమాండ్ చేసిందని, అందుకు మారుతీరావు కూడా అంగీకరించాడని రంగనాథ్ తెలిపారు. ఈ కేసును మూడు రోజుల్లోనే ఛేదించామని, స్క్రీన్ మీద కనిపిస్తున్న పాత్రధారి ఒకరేనని, దీని వెనుక చాలా మంది ఉన్నారని అన్నారు. ఈ కేసులో అమృత వర్షిణి ఆరోపించిన మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, నయీమ్ గ్యాంగ్ ల ప్రమేయంపై, విచారణ జరిపిస్తామని, ఈ కేసులో అమృత స్టేట్ మెంట్ తీసుకోవాల్సి వుందని అన్నారు. అయితే ఈ మూడు రోజుల విచారణలో మాత్రం అతని ప్రమేయంపై ఆధారాలు లభ్యం కాలేదని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pranay murder case  maruthi rao  subash sharma  mahmmad bari  aszar ali  shravan  abdul kareem  shravan  crime  

Other Articles