FIR against minister DK Shivakumar after Rs 8 cr seize మంత్రి శివకుమార్ పై మనీలాండరింగ్ కేసు..

Ed initiates money laundering probe against dk shivakumar

dk shivakumar, dk shivakumar tax case, money laundering dk shivakumar, enforcement ditectorate, karnataka congress, income tax department, karnataka, Politics

The Enforcement Directorate (ED) has registered a money laundering case against Karnataka minister DK Shivakumar and few others on the basis of an alleged tax evasion and hawala transactions case, officials said.

మంత్రి శివకుమార్ పై మనీలాండరింగ్ కేసు.. కర్ణాటకలో హాట్ టాఫిక్..

Posted: 09/18/2018 03:12 PM IST
Ed initiates money laundering probe against dk shivakumar

కర్ణాటకనాట కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకువచ్చేందుకు శాయశక్తులా కృషి చేసి.. చివరకు సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు దోహదపడిన వారిలో కర్ణాటక కాంగ్రెస్ నేత, మంత్రి డీకె శివకుమార్ శ్రమ ఎంతో వుంది. కాగా ఆయనపై తాజాగా ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. హవాలా ఆరోపణలతో పాటు, పన్ను ఎగవేతకు పాల్పడ్డారన్న ఆరోపణలతో శివకుమార్ సహా మరో ముగ్గురు వ్యక్తులపై ఈడీ ఈ మేరకు ఎఫ్ఐఆర్ ను నమోదైంది.

ఈ ఏడాది ప్రారంభంలో ఆదాయపన్ను శాఖ దాఖలు చేసిన చార్జీషీటును ఆధారంగా చేసుకుని ఈడీ ఈ కేసులు నమోదు చేసింది. ఈ ఎప్ఐఆర్ లో ఢిల్లీలోని కర్ణాటక భవన్ ఉద్యోగి హనుమంతయ్య పేరు కూడా వుంది. శివకుమార్, అతని అనుచరులు ఎస్‌కే శర్మ హవాలా మార్గంలో లెక్కా పత్రం లేని డబ్బును తరలించారని ఆదాయ పన్ను శాఖ చార్జీషీటులో పేర్కొంది.

తన అనుచరుల సహాయంతో బెంగళూరు, ఢిల్లీల్లో శివకుమార్ ఓ నెట్‌వర్క్ ఏర్పరుచుకున్నారని, వీరి ద్వారానే హవాలా లావాదేవీలకు పాల్పడ్డారని ఐటీ అధికారి ఒకరు తెలిపారు. శివకుమార్‌తో పాటు సచిన్ నారాయణ్, ఆంజనేయ హనుమంతయ్య, ఎన్.రాజేంద్రలపై కేసు నమోదైనట్టు చెప్పారు. సచిన్ నారాయణ్.. శివకుమార్ వ్యాపార భాగస్వామిగా ఉన్నాడు.ఢిల్లీ కర్ణాటక భవన్‌లో ఉంటూ హనుమంతయ్య శివకుమార్ హవాలా ఆర్థిక లావాదేవీలకు సహకరించినట్టు ఆరోపణలున్నాయి. కర్ణాటక భవన్ పర్యవేక్షకుడిగా ఉన్న రాజేంద్ర కూడా శివకుమార్ అక్రమ ఆర్థిక కార్యకలాపాలకు సహకరించాడని ఐటీ శాఖ ఆరోపిస్తోంది.

గత అగస్టులో ఢిల్లీ, బెంగళూరు నగరాల్లో ఐటీ శాఖ జరిపిన దాడుల్లో శివకుమార్‌కు చెందిన రూ.20కోట్ల లెక్కా పత్రం లేని డబ్బు పట్టుబడింది. అయితే శివకుమార్ మాత్రం ఐటీ శాఖ తనను ఉద్దేశపూర్వకంగానే టార్గెట్ చేసిందని ఆరోపిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే ఆయన బెయిల్ కూడా పొందారు. కేసు తదుపరి విచారణ సెప్టెంబర్ 20న జరగాల్సి ఉంది. కాగా, గత ఏడాది రాజ్యసభ ఎన్నికల సందర్భంగా గుజరాత్ ఎమ్మెల్యేలను కర్ణాటకకు తరలించి.. బీజేపీ గాలానికి అందకుండా చేయడంలో శివకుమార్ కీలక పాత్ర పోషించడంతోనే కేంద్రం ఐటీ అధికారులను తనపైకి ఉసిగోల్పి కక్షపూరితంగానే కేసులు పెట్టించిందని అరోపించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles