Canadian shooting leaves four dead కెనడాలో కాల్పుల కలకలం.. నలుగురు మృతి..

Canada shooting two police officers among four killed in fredericton

Brookside, Canada shooting, Fredericton, Gun violence, gun violence in canada, Justin Trudeau, New Brunswick, Ottawa, Toronto, Fredericton police, Fredericton, Canada shooting, canada, crime

Two police officers were among four people killed Friday in a shooting that sparked panic and a police lockdown in a sleepy eastern Canadian city, as the nation grapples with rising gun violence.

కెనడాలో కాల్పుల కలకలం.. నలుగురు మృతి..

Posted: 08/11/2018 11:14 AM IST
Canada shooting two police officers among four killed in fredericton

కెనడాలో కలకలం రేపిన తుపాకీ కాల్పులు ఘటనలో నలుగురు మృతి చెందారు. అగంతకుడి కాల్పులలో అసువులు బాసిన వారిలో ఇద్దరు పోలీసు అధికారులతో పాటు మరో సంగీత విద్యాంసుడు కూడా వున్నారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో మరికొందరు క్షతగాత్రులయ్యారని సమాచారం. కెనడాలోని ఫ్రెడెరిక్టన్ సిటీ ప్రాంతంలో ఓ అగంతకుడు జరిపిన కాల్పులు జరపడంతో.. ఈ దారుణం చోటుచేసుకుంది. కాల్పులు జరిపిన వ్యక్తి కోసం పోలీసుల అన్వేషణ కొనసాగుతుంది. ఈ మేరకు ఓ పోలీసు అధికారి తన ట్వీట్ ద్వారా సమాచారాన్ని అందించారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది.

కాగా అగంతకుడు తన మానసిక స్థితిని కోల్పోయిన ‘సైకో’ అయి ఉండొచ్చనే అనుమానాన్ని వ్యక్తం చేసిన ఫ్రెడెరిక్టన్ సిటీ పోలీసులు.. ప్రజలు అతడి పట్ల అప్రమత్తంగా వుండాలని.. అనుమానాస్పదంగా తచ్చాడే వ్యక్తులు ఎక్కడ కనిపించినా తమకు తెలియజేయాల్సిందిగా ట్విట్టర్ ద్వారా ప్రజలకు సూచించారు. అంతేకాకుండా ఫ్రెడెరిక్టన్ సిటీ చుట్టుపక్కల ప్రాంతాలలోకి ఎవ్వరూ రావొద్దంటూ ట్విట్టర్ వేదికగా హెచ్చరికలు కూడా జారీ చేశారు. సిటీలోని జనాలందరూ తలుపులు వేసుకుని, లోపలే ఉండాలని కోరారు. ఎవరైన కొత్త వ్యక్తులు తలుపు తడితే వెంటనే డోర్ తెరవొద్దని చెప్పారు.

అత్యవసర పరిస్థితి ఎదురైనా, అనుమానితులుగా ఎవరైనా కనిపించినా వెంటనే తమకు సమాచారం అందించాలని కోరాడు. అయితే కొద్దిసేపటి తర్వాత కాల్పులు జరిపిన వ్యక్తిని అరెస్టు చేసినట్టు పోలీసులు ట్వీట్ చేశారు. దాంతో కొంతసేపు భయంతో వణికిపోయిన ఫ్రెడరిక్టన్ సిటీ ప్రజలు, కుదుటపడ్డారు. అయితే సదరు వ్యక్తి కాల్పులు జరపడానికి కారణాలు మాత్రం ఇంకా వెల్లడి కాలేదు. ఫ్రెడెరిక్టన్ కాల్పుల ఘటనకు సంబంధించిన నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని ట్వీట్ చేసిన ప్రధాని జస్టిన్ ట్రూడూ, ఈ ఘటనపై క్షుణ్ణంగా విచారణ జరిపిస్తామని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Toronto  Fredericton police  Fredericton  Canada shooting  canada  

Other Articles