RS deletes remarks made by PM Modi ప్రధాని అభ్యంతరకర వ్యాఖ్యలు.. రికార్డుల నుంచి తొలగింపు..

Rs deletes remarks made by pm modi on deputy chairman contestant

Congress, BK Hariprasad, Rajya Sabha Chairman, M Venkaiah Naidu, Rajya Sabha deputy Chairman, PM Narendra Modi, controversial statements, objectionable comments, Harivansh Narayan Singh, expunge, dignity of RS, Politics

PM Modi's remarks in Rajya Sabha were expunged by chairman M Venkaiah Naidu after they were found to be 'objectionable'.

ప్రధాని అభ్యంతరకర వ్యాఖ్యలు.. రికార్డుల నుంచి తొలగింపు..

Posted: 08/11/2018 10:51 AM IST
Rs deletes remarks made by pm modi on deputy chairman contestant

రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ కోసం జరిగిన ఎన్నికల అనంతరం కొలువైన ప్రధాని నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు రికార్డుల నుంచి వాటిని తొలగించారు. అత్యంత అరుదుగా జరిగే చర్యే అయినా ప్రధాని వ్యాఖ్యలపై అభ్యంతరాలు వ్యక్తం కావడంతో రాజ్యసభ చైర్మన్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. రాజ్యసభ ఢిప్యూటీ ఎన్నికలలో జేడీ(యు) పార్టీకి చెందిన హరివంశ్ నారాయణ సింగ్ ను తమ అభ్యర్థిగా బరిలో నిలిపిన ఎన్డీయే.. తమ అభ్యర్థి కాంగ్రెస్ కు చెందిన అభ్యర్థి బికే హరిప్రసాద్ పై 20 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

దీంతో రాజ్యసభకు వచ్చిన మోదీ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారయాన్ సింగ్ ను అభినందించేందుకు ప్రసంగించారు. మోదీ తనదైన శైలిలో ప్రసంగిస్తూ ‘‘దోనో తరఫ్ హరి థే. ఏక్ కే ఆగే బి.కే. థా! బి.కే హరీ కోయి నా బికే థా. యహా పే జో హరి కో బికే వో బి.కే నహీ థా!’’ అని పేర్కొన్నారు. దీనికి.. ‘‘ఇరు వైపులా హరి అన్న పేరు కలిగిన వ్యక్తులే ఉన్నారు. ఒకరి ఇంటి పేరు బి.కె. కానీ ఆయన అమ్ముడు (బికే) పోలేదు. ఇక్కడ అమ్ముడు పోయిన (బికే) హరి మరొకరు ఉన్నారు. కానీ ఆయన బి.కె. కాదు’’ అని చమత్కరించారు.

సభ్యులు గెలిపించలేదు.. అన్న అర్థంలో బికేను వాడాలనుకున్నా అది అమ్ముడుపోయిన అర్థం స్ఫురించడంతో వివాదాస్పదమైంది. తాను అమ్ముడుపోయానని అంటారా? అంటూ ఓటమి పాలైన హరిప్రసాద్ మోదీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ దేశ ఖ్యాతిని దిగజార్చారని, ఆయన వ్యాఖ్యలు సిగ్గు చేటని కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ అన్నారు. మోదీ వ్యాఖ్యలను నిరసిస్తూ రాజ్యసభ చైర్మన్ వెంకయ్యకు కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. దీంతో స్పందించిన వెంకయ్య మోదీ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : PM Modi  deputy Chairman  BJP  Congress  Venkaiah Naidu  BK Hariprasad  Harivansh Singh  Rajya Sabha  Politics  

Other Articles