chandrababu writes letter to pm modi విభజన హామీలు, ఉక్క పరిశ్రమపై ప్రధానికి చంద్రబాబు లేఖ..

Chandrababu writes letter to modi demanding steel factory to ap

cm chandrababu, pm modi, central government, state bifurfication bill, steel plant, cm ramesh, tdp mp, indefinete hunger strike, andhra pradesh, politics

Andhra pradesh chief minister chandrababu naidu had written a letter to Prime Minister Modi demanding to impliment state bifurcation bill and steel plant at kadapa.

విభజన హామీలు, ఉక్క పరిశ్రమపై ప్రధానికి చంద్రబాబు లేఖ..

Posted: 06/20/2018 05:15 PM IST
Chandrababu writes letter to modi demanding steel factory to ap

విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను పరిష్కరించాలని కోరుతూ ఏపీ సీఎం చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని లేఖలో కోరారు. అలాగే, హేతుబద్ధత లేని విభజనతో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ కు రెవెన్యూ లోటు భర్తీ చేయాలని కోరడంతో పాటు పలు కీలక అంశాలను ప్రస్తావిస్తూ ప్రధానికి లేఖ రాశారు. ఎన్డీయే నుంచి బయటకు వచ్చాక చంద్రబాబు ప్రధానికి లేఖ రాశారు. ఉక్కు పరిశ్రమ స్థాపనకు కడప అనువైనదిగా పేర్కొంటూ గతంలో కేంద్ర ఉక్కు శాఖ ఇచ్చిన వివరాలను సీఎం ఈ సందర్భంగా లేఖలో ప్రస్తావించారు.

కాగా, కడపలో ఉక్క కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలన్న డిమాండ్ తో టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఇవాళ అమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారు. రాష్ట్రంలో ఉక్కు పరిశ్రమను సాధించేందుకు తాను ప్రాణత్యాగానికైనా సిద్దమని స్పష్టం చేశారు. అప్పటి వరకు తన దీక్ష కొనసాగుతుందన్నారు. క‌డ‌ప జిల్లాకు ఉక్కు పరిశ్రమ రాకుండా కేంద్రం అడ్డుపడుతోందని మండిపడ్డారు. ఎంపీ సీఎం రమేష్ దీక్షకు అన్ని వర్గాల ప్రజలనుంచి సంఘీభావం వ్యక్తమవుతుంది.

జిల్లా మినీ మహానాడులో ప్రకటించిన విధంగా ఆయన ఉక్కు కర్మాగారం సాధించేంతవరకు తన దీక్ష చేపడతానని కడప జడ్పీ కార్యాలయం ఆవరణలో ఆమరణ నిరాహర దీక్షకు దిగారు. ఆయనతో పాటు టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి కూడా ఆమరణ నిరాహార దీక్షలో కూర్చొన్నారు. ఉదయం తన స్వగ్రామమైన పోట్లదుర్తిలో ఆయన తల్లిదండ్రుల విగ్రహాలకు పూలమాల వేశారు. అక్కడి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భారీ కాన్వాయ్ తో కడపకు చేరుకున్నారు.

ఈ సంద‌ర్భంగా సీఎం ర‌మేశ్ మాట్లాడుతూ.. ప్రజల మద్దతుతో జిల్లా యువత కోసం ఉక్కు పరిశ్రమ సాధించేవరకు పోరాటం కొనసాగిస్తానని ప్ర‌క‌టించారు. క‌డ‌ప జిల్లాకు చెందిన ప్ర‌తిప‌క్ష నేత జగన్.. కేంద్రం అన్యాయం చేస్తుంటే ఒక్క మాట మాట్లాడక పోవడం ఏమిట‌ని ప్ర‌శ్నించారు. మెకాన్ సంస్థ ఇచ్చిన ముసాయిదా నివేదికను కేంద్రం ఎందుకు తొక్కి పెట్టిందని నిల‌దీశారు. కేంద్ర ప్ర‌భుత్వ‌మే స్వయంగా సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన‌ప్ప‌టికీ.. ఇంకా ప్రజలను మభ్య పెట్టేందుకు జిల్లాకు ఉక్కు పరిశ్రమ వస్తుందని చెబుతూ మోసం చేస్తున్నారని ఆయన మండి పడ్డారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cm chandrababu  pm modi  state bifurfication bill  steel plant  cm ramesh  andhra pradesh  politics  

Other Articles