no change in Petrol and diesel prices even if falls under GST ఇంధనాన్ని జీఎస్టీ ఊరిస్తున్నా.. ఉరట మాత్రం కల్ల..?

No change in petrol and diesel prices even if falls under gst

oil price, crude oil, price hike, petrol, diesel, dharmendra pradhan, goods and service tax, petrol price, diesel price

Whenever Fuel prices will be on a continuous rise, union minister dharmendra pradhan say, centre is trying to bring them under gst, but now to the latest information. fuel rates will not be lowered even if they fall under gst says experts.

ఇంధనాన్ని జీఎస్టీ ఊరిస్తున్నా.. ఉరట మాత్రం కల్ల..?

Posted: 06/20/2018 07:07 PM IST
No change in petrol and diesel prices even if falls under gst

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు రికార్డు స్థాయిని అందుకుని అల్ టైం హైలో కొనసాగిన నేపథ్యంలో కానీ లేక వరుసగా పెట్రో ధరలు పెరుగుతున్న క్రమంలో కానీ కేంద్ర ఇంధన శాఖ మంత్రి దర్మేంద్ర ప్రధాన్ మీడియా ముందుకు వచ్చి తన పాత పాటనే అలపించే ప్రయత్నం చేస్తారు. అదే ఇంధనాన్ని కూడా జీఎస్టీ పరిధిలోకి తీసుకువచ్చే ప్రయత్నాలకు కేంద్రం చేస్తుంది. జీఎస్టీ పరిధిలోకి ఇంధనం చేరితే ధరలు గణనీయంగా తగ్గుతాయని కూడా చెప్పడం మనందరికీ తెలిసిందే.

దీంతో చమురు ధరలను వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ) పరిధిలోకి తీసుకురావాలని విపక్ష పార్టీలు డిమాండ్‌ చేయడం ప్రారంభించాయి. అయితే ఇలా జీఎస్టీ పరిధిలోకి ఇంధనం చేరినా మన ధనం గల్లా మారుతుందోమె కానీ గుల్లకావడం మాత్రం తప్పదన్న వార్తలు ప్రస్తుతం వినిపిస్తున్నాయి. పెట్రోల్‌, డీజిల్‌ను జీఎస్‌టీ కిందకు తీసుకొస్తే.. ఆయా చమురు ధరలపై ఎలాంటి ప్రభావం వుండబొదన్నది తాజా అప్ డేట్. వీటిపై కొంతమేరకు స్పష్టతనిస్తున్నారు ఆయా రంగ విశ్లేషకులు.

పెట్రోల్‌, డీజిల్‌ను జీఎస్‌టీ పరిధిలోకి తీసుకొచ్చినా అవి పూర్తిస్థాయి జీఎస్‌టీ కిందకు రావని ఓ సీనియర్‌ అధికారి అన్నారు. ఒకవేళ చమురును వస్తు, సేవల పన్ను పరిధిలోకి చేర్చితే.. గరిష్ఠంగా 28శాతం జీఎస్‌టీతో పాటు లోకల్‌ సేల్స్‌ ట్యాక్స్‌ లేదా వ్యాట్‌ కూడా ఉండే అవకాశాలున్నాయన్నారు. అలా జరిగితే మళ్లీ ప్రస్తుతం ఉన్న ధరల మాదిరిగానే ఉంటుందన్నారు. ‘ప్రపంచంలో ఎక్కడా పెట్రోల్‌, డీజిల్‌పై పూర్తిస్థాయి జీఎస్‌టీ లేదు. అందుకే భారత్‌లోనూ జీఎస్‌టీతో పాటు వ్యాట్‌ కూడా ఉంటుంది’ అని సదరు అధికారి తెలిపారు. కేంద్రం, రాష్ట్రాలు సంయుక్తంగా నిర్ణయం తీసుకుంటేనే పెట్రోల్‌ ఉత్పత్తులను జీఎస్‌టీ కిందకు చేర్చడం జరుగుతుందన్నారు.

ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం లీటర్‌ పెట్రోల్‌పై రూ. 19.48, లీటర్‌ డీజిల్‌పై రూ. 15.33 ఎక్సైజ్‌ సుంకాన్ని విధిస్తోంది. దీంతో పాటు రాష్ట్రాలు వ్యాట్‌ను కూడా విధిస్తున్నాయి. పెట్రోల్‌పై ఈ వ్యాట్‌ ముంబయిలో అత్యధికంగా 39.12శాతం, అండమాన్‌ అండ్‌ నికోబార్‌లో అత్యల్పంగా 6శాతం ఉంది. ఇక డీజిల్‌పై తెలంగాణలో అత్యధికంగా 26శాతం ఉంది. మొత్తం పన్నులు కలిపి పెట్రోల్‌పై 45 నుంచి 50శాతం, డీజిల్‌పై 35 నుంచి 40శాతం ఉన్నాయి. జీఎస్‌టీలోకి చేర్చితే కూడా దాదాపు ఇదే స్థాయిలో పన్నులు ఉంటాయని సదరు ప్రభుత్వ అధికారి పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles