Woman insists on meeting IPS officer గ్రీకువీరుడు.. నా రాకుమారడు.. ఎస్పీపై మనసుపడిన పీజీ విద్యార్థిని..

Punjab woman comes to madhya pradesh to meet her hero ips officer

Sachin Atulkar, Ujjain, Madhya Pradesh, IPS, Superintendent of Police, Rekha Verma, woman, Hoshiyarpur, Punjab, Sagar district, psychology, film, Cricket

A 27-year-old woman from Hoshiyarpur district of Punjab landed in Ujjain three days ago to meet Sachin Atulkar (34), currently posted here as the Superintendent of Police.

గ్రీకువీరుడు.. నా రాకుమారుడు.. ఎస్పీపై మనసుపడిన పీజీ విద్యార్థిని..

Posted: 06/20/2018 11:58 AM IST
Punjab woman comes to madhya pradesh to meet her hero ips officer

సినీమా హీరోలకు, క్రికెటర్లకు ఏ మాత్రం తీసిపోని విధంగా అందంలో అందం.. దేహదారడ్యంలో కండలు తిరిగిన శరీరం.. ఇక సెలబ్రిటీలకు ఏ మాత్రం తక్కువ కాకుండా ఐపీఎస్ ఉద్యోగహోదా.. ఇవన్నీ అతన్ని నిజమైన హీరోగా మలిచాయి. సినిమా హీరోలు లేదా క్రికెట్ స్టార్లు లేదా రాజకీయ నేతలకు మాత్రమే అభిమానుల వుంటారన్న వార్తలను తోసిరాజుతూ.. అనేక మంది అదరాభిమానాలను సంపాదించుకున్న ఈ హీరోయే సచిన్ అతుల్కర్. తన విధులను సక్రమంగా నిర్వహిస్తునూనే.. అభిమానులను సంపాదించుకున్న అనేక మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను చూశం.

అయితే అతుల్కర్ మాత్రం హీరోలకు తగ్గని అందంలో అమ్మాయిల గుండెలను పిండేస్తున్నాడంటే.. అతిశయోక్తి కాదు. తన విధులు, తాను జిమ్ లో గడిపే సమయం, తన దేహదారుడ్యం.. ఇలా అన్ని అంశాలలో మిస్టర్ ఫర్ ఫెక్ట్ అనే మాటకు నిర్వచనంలా వున్న ఈయనపై అనేక మంది అమ్మాయిలు ఫిదా అయ్యారు. అయితే ఐపీఎస్ కాబట్టి ఎవ్వరూ సహసించి అతడ్ని చేరుకుని తమ మనస్సులోని అభిప్రాయాన్ని వెల్లడించే ధైర్యం చేయలేదు. కానీ పంజాబ్ లోని హోషియార్ పూర్ కు చెందిన 27 ఏళ్ల యువతి మాత్రం అలాంటి సాహసమే చేసింది

పంజాబ్ నుంచి మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినీకి మూడు రోజుల క్రితం వచ్చిన.. తాను ఎస్పీ సచిన్ అతుల్కర్ ను కలవాల్సిందేనంటూ పట్టుబడుతూ ఉండటంతో పోలీసులు తల పట్టుకున్నారు. అమెకు కౌన్సిలింగ్ చేపట్టినా ఫలితం లేదు. దీంతో అమె కోర్కెలను తీర్చుతూ.. అమె తల్లిదండ్రులకు కబురు పెట్టారు పోలీసులు. అయినా అమె వెళ్లడానికి నిరాకరించింది. అంతటితో అగకుండా పంజాబ్ కు వెళ్లే రైలును కూడా ఎక్కించినా.. అమో మార్గమధ్యంలో రైల్లోంచి దూకేస్తానని బెదిరింపులు చేయడంతో పోలీసులకు దిక్కతోచని పరిస్థితి ఏర్పడింది.

సోషల్ మీడియాలో సచిన్ అతుల్కర్ ఫొటోలను చూసి మనసు పారేసుకున్న సదరు యువతి, ఆయన్ను కలిసి, తన ప్రేమను వ్యక్తపరిచే ఉద్దేశంతో వచ్చినట్టు గుర్తించారు. గత మూడు రోజులుగా తమ ఎస్పీ అతుల్కర్ ఏ సమావేశానికి వెళ్లినా.. అక్కడకు వెళ్లేందుకు ప్రయత్నిస్తుంది. అలా కుదరిన భావించిన యువతి నేరుగా ఆయనను కలవాలని ఆయన అధికారిక కార్యాలయానికి కూడా చేరుకుని.. అక్కడి పోలీసులను ఒత్తిడి చేసిందని మహిళా పోలీస్ స్టేషన్ ఇన్ చార్జ్ రేఖా వర్మ తెలిపారు. ఎస్పీని కలవాలని ఆమె చాలా పట్టుదలతో ఉందని అన్నారు. సదరు యువతి సైకాలజీలో పీజీ చేస్తుందని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sachin Atulkar  Ujjain  Madhya Pradesh  IPS  woman  Hoshiyarpur  Punjab  film  Cricket  

Other Articles