IMD forecasts a scorching month of may in hyderabad మాడు పగలుతుంది.. మహానగర వాసులకు చేదు వార్త..!

Imd forecasts a scorching month of may in hyderabad

Indian Meteorological Department, summer sun, scorching week, scorching heat, heat wave, thunderstorms, gusty winds, hyderabad, telangana

The summer sun showed no signs of relenting and beat down with vengeance on the hyderabad city, with the maximum temperature staying put at 42 degree Celsius n hyderabad.

మాడు పగలుతుంది.. మహానగర వాసులకు చేదు వార్త..!

Posted: 05/08/2018 01:08 PM IST
Imd forecasts a scorching month of may in hyderabad

ప్రచండ భానుడి భగభగలకు తెలుగురాష్ట్రాల ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎండలో తప్పనిసరై వెళ్తున్న ప్రజలపైనే కాదు.. ఇళ్లలో వున్నవారిపై కూడా తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. అత్యవసరమై ఎండలో వెళ్లాల్సి వచ్చిన ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఏప్రిల్ నెలాఖరు నుంచి మే వరకు ఎండ తీవ్రత అధికంగా వుంటుందని ఇప్పటికే హెచ్చరించిన వాతావరణ కేంద్రం అధికారులు.. తాజాగా మరో విషయాన్ని స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్రాలతో పాటు హైదరాబాద్ మహానగరంలో ఎండలు మరింత పెరుగుతాయని, ఫలితంగా ఉష్ణోగ్రతలు కూడా క్రమేపి పెరుగుతాయని వెల్లడించారు.

ఉదయం 8 గం. నుంచి భానుని ప్రతాపం ప్రజల పై పడుతోంది. పది గంటలు దాటిదంటే చాలు రోడ్లపై తిరిగే పరిస్థితి లేకుండా తయారైంది. ఇప్పుడే ఇలావుందంటీ అంటూ ప్రజలు చర్చించుకుంటున్న ప్రజలకు అధికారులు మరో చేధువార్తను అందించారు. ఇటీవల కురిసిన వర్షాలతో వాతావరణం కాసింత చల్లబడినప్పటికీ.. మళ్లీ మరుసటి రోజుకు యధావిధంగా ఎండ వేడిమి ఇబ్బంధిపెడుతున్నాయి. సాధారణ ఉష్ణోగ్రతల కంటే 2 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టు బేగంపేట వాతావరణ శాఖాధికారులు తెలిపారు.

ఈ సందర్భంగా వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్నం మాట్లాడుతూ, మే నెలలో సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీల అధికంగా వాతావరణ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెప్పారు. కాగా, గత ఐదు రోజులుగా హైదరాబాద్ లో నమోదైన గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40.7, 39.3, 39.0,  35.5, 39.0 కాగా, కనిష్ఠ ఉష్ణోగ్రతలు  25.8, 27.3, 25.8, 21.9, 26.9 గా ఉన్నాయి. భానుడి విశ్వరూపంతో ప్రజలు అల్లాడుతున్న క్రమంలో మరోవైపు తీవ్ర ఉక్కపోత కూడా సమస్యను జఠిలంగా మారుస్తుంది. గాలిలో తేమ పూర్తిగా ఆవిరై పోతుండటంతో గాలి వీచినా.. వేడమే పుట్టుకువస్తుందని ప్రజలు అంటున్నారు. నిప్పుల కుంపటి ప్రక్కనే ఉన్నంత విధంగా వేడి గాలి హడలెత్తిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles