CBI detains Unnao MLA Kuldeep Singh Sengar ఎట్టకేలకు సీబిఐ పోలీసుల అదుపులో బీజేపి ఎమ్మెల్యే

Booked for rape cbi detains bjp mla kuldeep singh sengar

Unnao rape case, kuldeep singh sengar, central bureau of investigation, Yogi Adityanath, special investigation team, bjp mla rape, bjp mla gangrape, bjp mla dalit minor girl rape, uttar pradesh, politics

Bangarmau BJP MLA Kuldeep Singh Sengar, who was booked over rape allegations levelled by a 17-year-old minor dalit girl in Uttar Pradesh’s Unnao, was taken into custody by the CBI from his Lucknow residence in the wee hours of Friday.

ఉన్నావ్ రేప్ కేసు: ఎట్టకేలకు సీబిఐ అదుపులో బీజేపి ఎమ్మెల్యే

Posted: 04/13/2018 11:01 AM IST
Booked for rape cbi detains bjp mla kuldeep singh sengar

దళిత వర్గానికి చెందిన మైనర్ బాలికపై తన సోదరుడితో కలిసి సామూహిక అత్యాచార చేసినట్లు అబియోగాలను ఎదుర్కోంటున్న కేసులో ఎట్టకేలకు నిందితుడైన బీజేపి ఎమ్మెల్యే కుల్దీప్‌ సింగ్ సెంగార్ ను కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) అదుపులోకి తీసుకుంది. దేశవ్యాప్తంగా బీజేపి ఎమ్మెల్యే తీరుపై నిరసనగళాలు అధికమవ్వడం.. అపై బాధిత బాలిక తండ్రిని కూడా పోలీసులు లాకప్ డెత్ చేయడంతో మిన్నంటిన అగ్రహాజ్వాలలతో  ప్రభుత్వానికి దిక్కుతోచని స్థితిలో ఎట్టకేలకు పోలీసులను అదేశించడంలో వారు తొలుత ఆయన సోదరుడు సహా ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.

కాగా ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ కూడా సామూహిక అత్యాచారం కేసులో నిందితుడేనని అతన్ని కూడా అరెస్టు చేయాలని బాధిత బాలిక సహా అమె కుటుంబసభ్యులు డిమాండ్ చేయడంతో కదలిన ప్రభుత్వం అతనిపై కూడా మూడు వేర్వేరు కేసులను నమోదు చేసింది. కాగా ఈ కేసును సిబిఐకి బదిలీ చేస్తున్నామని ముఖ్యమంత్రి యోగి అధిత్యనాత్ స్వయంగా ప్రకటించడంతో.. రంగంలోకి దిగిన సీబిఐ.. ఆయనపై నమోదైన మూడు వేర్వేరు కేసులను దర్యాప్తు చేస్తుంది. దళిత బాలిక గ్యాంగ్ రేప్, బాలిక తండ్రి లాకప్ డెత్ సహా మరో కేసులో బీజేపి ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ అభియోగాలు ఎదుర్కోంటున్నాడు.

ఉత్తరప్రదేశ్ పోలీసులు ఎమ్మెల్యే కుల్దీప్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పటికీ అరెస్ట్‌ చేయకపోవడంపై వివాదం నెలకొంది. అయితే కేసు సీబీఐకి అప్పగిస్తున్నందున ఆయనను అదుపులోకి తీసుకునే అంశం దర్యాప్తు సంస్థ చూసుకుంటుందని పోలీసులు స్పష్టంచేశారు. ఎట్టకేలకు ఈరోజు ఉదయం సీబీఐ ఆయనను కేసు విషయంలో ప్రశ్నించేందుకు అదుపులోకి తీసుకుంది. లక్నోలోని సీబీఐ కార్యాలయంలో అధికారులు సెంగార్ ను ప్రశ్నిస్తున్నారు. విచారణ నిమిత్తం సెంగార్ ను ఉదయం 5 గంటల ప్రాంతంలో సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles