reason behind Sudheer Murder.. group clashes or theft video.? సుధీర్ ప్రాణాలను తీసింది..దొంగతనం వీడియోనా.? గ్రూపు తగదాలా.?

Inter student sudheer murder group clashes or theft video

Intermediate student, murder, Kukatpally, Sudheer Erragalla, inter student murder, sudheer pragati inter collage, group clashes, street clash, theft video, inter student murder by colleagues, students murder friend, inter student murder in kukatpally, cyberabad police, hyderabad news, crime news

An Intermediate 2nd Yr Student By Name Sudheer was Brutally Murdered Near JSP Honda Showroom, on National Highway-65 Under Kukatpally PS Limits yesterday.. police investigating the reason behind the murder is it of theft video or group clashes.

సుధీర్ ప్రాణాలను తీసింది..దొంగతనం వీడియోనా.? గ్రూపు తగదాలా.?

Posted: 03/13/2018 10:54 AM IST
Inter student sudheer murder group clashes or theft video

కూకట్‌పల్లిలో ఇంటర్ విద్యార్థి సుధీర్ పై సహచరులు ఏకంగా కత్తులు, వేటకొడవళ్లతో వెంటాడి, వెంబడించి.. వేటకొడవళ్లతో హత్య చేయడానికి కారణం ఏమిటీ అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగుతుంది. ముందుగా ప్రమే వ్యవహారాలే ఇంతటి దారుణానికి కారణమని భావించినా.. అసలు కారణం మాత్రం అది కాదని తేలిపోయింది. కేవలం దొంగతనం చేస్తూ నిఘా కెమెరాలకు చిక్కిన వీడియోను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తారన్న భయం కారణంతో ఈ హత్య జరిగిందన్న కోణంలో పోలీసులు దర్యాప్తు సాగుతుంది. దీనికి తోడు మూసాపేటలోని బస్తీల మధ్య అధిపత్య పోరు కూడా ఈ దారుణానికి కారణమని పోలీసుల విచారణలో వెల్లడైంది.  

కూకట్ పల్లి ఏసీబీ కార్యాలయం, ట్రాఫిక్‌ పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలోనే సుధీర్ ను అడ్డగించిన దుండగులు.. అతనిపై వేటకోడవళ్లతో దాడికి యత్నించారు. అయితే అప్రమత్తమైన సుధీర్ రోడ్డుపై వెళ్తున్న ప్రైవేటు స్కూలు బస్సును ఎక్కాడు. దుండగులు కూడా ఆ బస్సును ఎక్కి సుధీర్ ను బయటకు లాగి రోడ్డుపై పడేసి వేటకొవళ్లతో నరికి చంపారు. దీంతో బస్సులోని చిన్నారులతో పాటు రోడ్డుపై ప్రయాణికులు కూడా తీవ్ర భాయందోళనకు గురయ్యారు. ఈ ఘటనతో ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోయింది.

కాగా వివరాల్లోకి వెళ్తే.. కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మూసాపేట జనతానగర్ లో రాజు, రాణి దంపతులకు ముగ్గురు సంతానం. అయితే పాల వ్యాపారం నిర్వహించే రాజు ప్రతిరోజు తన వద్ద నుంచి పాలప్యాకెట్లు దొంగలించబడుతున్నట్లు గుర్తించాడు. దొంగను పట్టుకునేందుకు రహస్యంగా నిఘా కెమెరాను ఏర్పాటు చేశాడు. మూసాపేల జెల్లల బస్తీకి చెందిన కృష్ణా పాల ప్యాకెట్లను దొంగలిస్తున్నాడన్న విషయం బయటపడింది. దీంతో కృష్ణను రాజు నిలదీశాడు. మరోమారు ఇలానే చేస్తే సోషల్ మీడియాలో పెడతానని హెచ్చరించాడు.

దీంతో అగ్రహం వ్యక్తం చేసిన కృష్ణ.. తన వీడియో సోషల్ మీడియాలో పెడితే చంపేస్తానని బెదిరించాడు. దీంతో విషయం తెలుసుకున్న రాజు చిన్నకొడుకు సుధీర్.. కృష్ణ వద్దకు వెళ్లి మా నాన్న జోలికి వస్తే సహించేది లేదు.. ఎంతవరకైనా వెళ్తా.. ఇంకోసారి పాలప్యాకెట్లు చోరి చేసినా.. చంపేస్తానని బెదిరింది. దీంతో సుధీర్‌పై కక్ష పెంచుకున్న కృష్ణ.. తన స్నేహితులతో కలసి పథకం వేసి పరీక్షలు రాసేందుకు వెళ్తున్న సుధీర్ పై ప్రకారం అతన్ని హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : inter student  sudheer  inter exams  group clashes  street clash  theft video  kukatpally  murder  knifes  draggers  cyberabad  crime  

Other Articles