congress leader dharma naik murder in thirumalagiri | మరో కాంగ్రెస్ నేత హత్య.. ఉలిక్కిపడ్డ నల్గొండ

Congress leader dharma naik murder in thirumalagiri mandal

criminal cases, congress leaders, nalgonda congress leaders murders, komati reddy venkat reddy, srinivas reddy, nalgonda muncipality, crime

thirumalagiri mandal congress leader and chintalapalem upa sarpanch dharma naik murder in the wee hours of tuesday with blasting a crude bomb was kept behind his bed.

మరో కాంగ్రెస్ నేత హత్య.. ఉలిక్కిపడ్డ నల్గొండ

Posted: 02/13/2018 11:55 AM IST
Congress leader dharma naik murder in thirumalagiri mandal

నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ నేతలే టార్గెట్ గా హత్యరాజకీయాలు సాగుతున్నాయా..? అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంచి పట్టున్న ఆయన నియోజకవర్గంలో.. ఆయనకు కుడిభుజంగా వున్న మునిసిపల్ చైర్‌పర్సన్ భర్త, కాంగ్రెస్ నేత బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్యతో జిల్లాలో ప్రారంభమైన హత్యా రాజకీయాలు.. ఇక జిల్లా వ్యాప్తంగా కొనసాగతున్నాయా.? అంటే అవునన్నట్లుగానే హత్యలు జరగుతున్నాయి. నెల రోజలు వ్యవధిలో ఏకంగా మూడు హత్యలు జరగడమే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.

నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ బలంగా వున్న నియోజకవర్గాల్లో మరో కాంగ్రెస్ నేత దారుణ హత్యకు గురవ్వడం ఈ అనుమానాలను స్థానికులు వ్యకత్ం చేస్తున్నారు. నల్గొండ జిల్లాలోని తిరుమలగిరి మండలం, చింతలపాలెం గ్రామ ఉప సర్పంచ్, కాంగ్రెస్ నేత ధర్మానాయక్‌ ను దుండగులు దారుణంగా హత్య చేశారు. ఇవాళ తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. ధర్మానాయక్ నిద్రిస్తున్న సమయంలో దుండగులు ఆయన మంచం కింద బాంబు పెట్టి పేల్చారు. దీంతో ధర్మానాయక్ శరీర భాగాలు చెల్లాచెదురుగా ఎగిరిపడ్డాయి.
 
ధర్మానాయక్ హత్యతో తిరుమల్ గిరి మండలం ఉలిక్కిపడింది. మండల పరిధిలోని చింతలపాలెం గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామస్తులు భయంతో వణికిపోతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గ్రామంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ధర్మానాయక్ హత్యకు పాత కక్షలే కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

 • Haneesha chowdary suicide case

  హనీషా అందుకే సూసైడ్ చేసుకుందా?

  Feb 19 | హైదరాబాద్ లో విద్యార్థిని హనీషా చౌదరి(24) ఆత్మహత్య కలకలం రేపిన విషయం తెలిసిందే. ఆమె సూసైడ్ కేసులో పోలీసులు మరిన్ని వివరాలు వెల్లడించారు. శివశివానీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ హనీషా చౌదరి ఎంబీఏ... Read more

 • Congress mla harris son mohammed nalapad surrenders in bengaluru pub brawl case

  36 గంటల తరువాత పోలీసులకు లొంగిపోయిన ఎమ్మెల్యే తనయుడు

  Feb 19 | తాను ఎమ్మెల్యే తనయుడిని అన్న అహంకారం నరనరాల్లో జీర్ణించుకుపోయిన ఓ యువకుడికి.. తన అధికార పక్షం కూడా తనను శిక్ష నుంచి కాపాడలేదని తెలియడం.. ఇక స్వయంగా ముఖ్యమంత్రే స్వయంగా తన ట్విట్టర్ ఖాతా... Read more

 • Young and dynamic warangal collector amrapali got married

  కాశ్మీరీ సంప్రదాయంలో కలెక్టర్ అమ్రపాలి కల్యాణం

  Feb 19 | వరంగల్ అర్బన్ జిల్లా డైనమిక్ కలెక్టర్ కాటా ఆమ్రపాలి కల్యాణం కమనీయంగా సాగింది. సంప్రదాయ కాశ్మీరీ దుస్తుల్లో మెరిసినపోయిన కలెక్టరమ్మ, గోవా ఐపీఎస్ అధికారి సమీర్ శర్మ పరిణయం.. జమ్మూ కాశ్మీర్ లో వైభవంగా... Read more

 • Plane crash kills passengers in iran

  ఘోర ప్రమాదం.. 66 మంది దుర్మరణం

  Feb 18 | ఇరాన్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ విమానం కూలిపోయిన ఘటనలో 66 మంది దుర్మరణం పాలయ్యారు. భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. టెహ్రాన్ నుంచి... Read more

 • Rgv attended before ccs police

  ముగిసిన వర్మ విచారణ.. మళ్లీ హాజరు కావాలని ఆదేశం

  Feb 17 | వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎట్టకేలకు పోలీసుల ముందు హాజరయ్యాడు. గాడ్, సెక్స్ అండ్ ట్రూత్' సినిమా నిర్మాణం, మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే కేసులకు సంబంధించి శనివారం హైదరాబాద్ సీసీఎస్ పోలీసుల... Read more

Today on Telugu Wishesh