Kavitha lends support to call for AP spl status ఆంధ్రులను ఆకట్టుకున్న టీఆర్ఎస్ ఎంపీ ప్రసంగం..

We support andhra mps agitating for special status trs mp kalwakuntla kavitha

Lok Sabha, Shivaji Kamble, Pravin Togadia, Congress party, TRS party, Arun Jaitley Kalvakuntla kavitha, Arun Jaitley, AP MPS agitation, Mps protest, Andhra pradesh special status, politics

MP Kavitha Kalvakuntla expressed support for "Andhra brothers" of the TDP and YSR Congress Party demanding special status for Andhra Pradesh.

ఆంధ్రులను ఆకట్టుకున్న టీఆర్ఎస్ ఎంపీ ప్రసంగం..

Posted: 02/09/2018 09:21 AM IST
We support andhra mps agitating for special status trs mp kalwakuntla kavitha

రాష్ట్రాలుగా విడిపోయినా.. తెలుగువారమంతా ఒక్కటే అని మరోమారు లోక్‌సభ సాక్షిగా చాటారిు టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత. రాష్ట్ర విభజన చట్టంలోని హామీలను నెరవేర్చాలన్న డిమాండ్ తో పార్లమెంటు ఉభయసభలను స్థంభింపజేస్తున్న టీడీపీ ఎంపీలకు అమె చేసిన ప్రసంగం మద్దతు పలికింది. లోక్ సభలోలో ఎంపీ కవిత జై అంధ్ర అంటూ ప్రసంగం చేసిన తీరు తెలుగురాష్ట్రా ప్రజలను ఆకట్టుకుంటోంది. కేంద్రం గత వారం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌లో అంద్రరాష్ట్రానికి అన్యాయం జరిగిన మాట వాస్తవమనే అన్నారు కవిత.

ఈ క్రమంలో నవ్యాంధ్రప్రదేశ్ కు చెందిన అధికార, విపక్ష ఎంపీలు అందోళన చేయడం సముచితమని చెప్పిన కవిత.. ఎంపీల నిరసన విరమింపజేసేందుకు కేంద్రప్రభుత్వం కృషి చేయాలని అటు ఇంగ్లీష్, ఇటు హిందీ బాషలలో అనర్గళంగా మాట్లాడరామె. పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన విభజన హామీలను నెరవేర్చాలని కోరారు. ప్రభుత్వాలు మారినంత్ర మాత్రాన అత్యున్నత చట్టసభల్లో ఇచ్చిన మాటలను విస్మరించరాదని అమె సూచించారు.

ఇంకా ఏపీ, తెలంగాణలోని పలు సమస్యలను ప్రస్తావించిన కవిత చివరల్లో ‘జై ఆంధ్రా’ అంటూ ప్రసంగాన్ని ముగించారు. ఆమె ప్రసంగాన్ని విన్న తెలుగు ప్రజలు ఖుషీ అయిపోతున్నారు. ఏపీ సమస్యల గురించి ప్రస్తావించి టీడీపీ ఎంపీల నిరసనకు మద్దతు తెలిపినందుకు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక సభలో మంత్రులు మాట్లాడుతున్నప్పుడు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేసిన టీడీపీ సభ్యులు, కవిత మాట్లాడుతున్నంత సేపు నిశ్శబ్దంగా ఉండిపోయారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles