DU student thrashes professor for harassing her ప్రొఫెసర్ కు తరగతి గదిలో పాఠాలు చెప్పిన విద్యార్ధిని

Du student thrashes professor for allegedly harassing her

Viral Videos,Delhi University,Social Media,Bharti College,Yogesh K Tyagi,University of Delhi,Bharti College professor,Dr Mukti Sanyal,National Students' Union of India,kiss and hug,Amit Kumar,assistant professor of Political Science,Maurice Nagar police, crime

A Video of a Delhi University student went viral on social media after she was allegedly sexually harassed by a professor.

ITEMVIDEOS: ప్రొఫెసర్ కు తరగతి గదిలో పాఠాలు చెప్పిన విద్యార్ధిని

Posted: 02/08/2018 05:36 PM IST
Du student thrashes professor for allegedly harassing her

కాలేజీ విద్యార్థులకు భవిష్యత్ బాగుపడాలని వారికి పాఠాల బోధనతో పాటు ఈ పాఠాలు వారి భవితకు ఎలా దోహదపడతాయన్న విషయాలను కూడా చెప్పి ప్రొఫెసర్లు వారిని తీర్చిదిద్దుతుంటారు. అయిత పాఠాలతో సరిపెట్టుకోకుండా, వారిని వేధించే పోకిరీ ప్రొఫెసర్లు కూడా చాలామందే వుంటారు. ఇక ఈ మధ్యకాలంలో లైంగిక వేధింపులకు పాల్పడే కొత్త తరహా ప్రోఫెసర్లను కూడా మనం చేస్తున్నాం.

ఇలా ఏకంగా ఓ విద్యార్థిని లైంగికంగా వేదిస్తున్న ప్రోఫెసర్ కు గుణపాఠం చెప్పాలని భావించింది ఓ విద్యార్థిని. ప్రోఫెసర్ వేధింపులు శృతిమించిపోతున్న నేపథ్యంలో తట్టుకోలేక త‌ర‌గ‌తి గ‌దిలోనే ఆ ప్రొఫెస‌ర్‌ని ఓ విద్యార్థిని కొట్టిసింది. అంతేకాదు ఇకపై సరిగ్గా నడుచుకోవాలని కూడా సూచించింది. అయితే నాలుగు గోడల మధ్య తాను ఫ్రొఫెసర్ కు బుద్దిచెప్పిన విషయాన్ని ప్రపంచానికి తెలియజేయాలని కూడా భావిందించింది. అంతే ఈ మొత్తం తతంగాన్ని వీడియో తీసి దానిని సోషల్ మీడియాలో పోస్టు చేసింది.

అంతే ఆ వీడియో కాస్తా నెట్టింట్లో వైరల్ గా మారింది, బాధిత యువతి ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని భారతి కాలేజ్‌లో బీటెక్ మూడో సంవత్సర విద్యార్థిని అని తెలిసింది. తరగతి గదిలోనే ప్రొఫెసర్ చెంపఛెళ్లుమనిపించి, నెట్టేసి, ఇక్కడితో వదిలేస్తున్నాం.. లేదంటే క్లాసు మొత్తాన్ని పిలిచి బుద్దిచెప్పాల్సి వుంటుందని ఆ యువతి ప్రోఫెసర్ ను హెచ్చరించింది. ఇక తరువాత ప్రొఫెసర్‌కి బుద్ధి చెప్పిన తరువాత ఆమె తమ వైస్ ఛాన్సలర్ కి ఓ లేఖ రాసి ఫిర్యాదు చేసి, అతడిపై చర్యలు తీసుకోమని కోరింది. ఈ ఘటనపై క్యాంపస్‌లో తోటి విద్యార్థులు నిరసన తెలిపారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles