PMO's tweet left Twitterati amused కామా మర్చిపోయి అర్థాన్ని మార్చేసిన ప్రధాని ట్విట్

Pmo s tweet typo got twitterati going all out grammar school on pm modi

narendra modi, narendra modi rajya sabha speech, narendra modi rajya sabha speech 2018, narendra modi mistake, narendra modi trolled, pmo tweet trolled, narendra modi, pm modi, modi twitter, modi tweets, pmo india twitter, modi grammatical mistake, politics

A tweet was posted on the Twitter account 'PMO India' with good intentions, but questionable grammar. The tweet was posted with regards to ensure quality healthcare for the poor.

కామా మర్చిపోయి అర్థాన్ని మార్చేసిన ప్రధాని ట్విట్

Posted: 02/09/2018 10:08 AM IST
Pmo s tweet typo got twitterati going all out grammar school on pm modi

వ్యాకరణ తప్పిదాలు ఒక్కోసారి మంచి చేస్తే మరోమారు పదిమందిలో తలదించుకునేలా చేస్తాయి. తాజాగా ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) చేసిన ట్వీట్ ఇదే తప్పిదంతో నెట్టింట్లో వైరల్ అయింది. ఈ ట్వీట్‌ను చూసిన నెటిజన్లు పీఎంఓపై తీవ్రస్థాయిలో కామెంట్లు చేస్తున్నారు. ఏ దేశ ప్రధానమంత్రి కూడా ఇలాంటి హామీని తమ మానిఫెస్టోలో పెట్టరని ఏకంగా నెట్ జనులు సూచిస్తున్నారు. ఇక మరికొందరు నిజం ఎన్నటికీ దాగదని కూడా తేల్చిచెబుతున్నారు. ఏకంగా వైద్యులు కూడా ప్రధాని ట్విట్ కు ఇది నిజమేనా..? అంటూ అశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఇంతకీ ఏం జరిగిందంటే.. ప్రధాని మోదీ పార్లమెంటులో చేసిన ప్రసంగం నుంచి ఓ అంశాన్ని తీసుకున్న ఆయన కార్యాలయం దానిని ట్విట్టర్‌లో పోస్టు చేసింది. అయితే ఈ క్రమంలో కామా పెట్టాల్సిన చోట ఆ విషయాన్ని మర్చిపోవడంతో దాని అర్థం పూర్తిగా మారిపోయింది. దీంతో అది చదివినవారు విస్తుపోయారు. అశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. కొందరు తప్పు జరిగింది చూసుకోమ్మని సూచించగా, కొందరు మాత్రం ట్రాల్ చేశారు. దీంతో ఈ ట్విట్ ను హ్యాండిల్ చేసిన ఉద్యోగికి వెనువెంటనే ప్రధాని కార్యాలయం ఊస్టింగ్ అర్డర్లను కూడా జారి చేసిందని సమాచారం.

ఇంతకీ ట్విట్ సారాంశమేమిటంటే.. ‘‘మనమంతా కలిసి నాసిరకమైన, అందుబాటులో ఉండే ఆరోగ్య సంరక్షణను అందించేందుకు కృషి చేద్దాం’’ అని ప్రధాని అన్నట్టు ట్వీట్ చేసింది. నిజానికి మోదీ ఉద్దేశం అదికాదు. ‘‘పేదలకు నాణ్యమైన, అందుబాటులో ఉండే ఆరోగ్య సంరక్షణను అందించేందుకు మనమంతా కృషి చేద్దాం’’ అన్నది అసలు ఉద్దేశం. అయితే ‘పూర్’ తర్వాత ‘కామ’(,) పెట్టడం మర్చిపోవడంతో దాని అర్థం పూర్తిగా మారిపోయింది. ఈ ట్వీట్‌ను చదివిన వారు తొలుత కంగారు పడ్డారు. తర్వాత ‘కామా’ మర్చిపోయిన విషయాన్ని గుర్తించి నవ్వుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : narendra modi  pm modi  twitter  netzens  pmo india twitter  grammatical mistake  troll  politics  

Other Articles