Anandiben Patel to be next Governor of MP ఎన్నికలకు రెడీ అవుతున్న మధ్యప్రదేశ్ గవర్నర్ గా ఆనందిబెన్ పటేల్

Ex gujarat cm anandiben patel is now madhya pradesh governor

Anandiben Patel, Madhya Pradesh, Madhya Pradesh governor, BJP, Amit Shah, Gujarat

Former Gujarat CM Anandiben Patel has been named the next Madhya Pradesh Governor. She replaces Om Prakash Kohli, who has additional charge of the office along with Gujarat.

ఎన్నికలకు రెడీ అవుతున్న మధ్యప్రదేశ్ గవర్నర్ గా ఆనందిబెన్ పటేల్

Posted: 01/20/2018 09:02 AM IST
Ex gujarat cm anandiben patel is now madhya pradesh governor

గుజరాత్  మాజీ ముఖ్యమంత్రి ఆనందీబెన్ పటేల్ కు సీఎం పదవి దక్కకపోయినా.. అధికారంలోని కేంద్రం అమెకు గవర్నర్ పదవిని కట్టబెట్టింది. అమె మధ్యప్రదేశ్ గవర్నర్ గా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ఆనందీబెన్ పటేల్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మధ్యప్రదేశ్ గవర్నర్‌గా నియమించారని, ఈ రోజు నుంచే ఆమె గవర్నర్ గా కొనసాగుతారని రాష్ట్రపతి భవన్ ట్వీట్ చేసింది.

గుజరాత్ మంత్రిగా అమె అందించిన సేవలను గుర్తించిన అప్పటి ముఖ్యమంత్రి ప్రస్తత ప్రధాని నరేంద్రమోదీ..  తన తరువాత గుజరాత్ పరిపాలనా బాధ్యతలను అమెకు అప్పగించారు. దీంతో 2014 నుంచి రెండేళ్ల పాటు 76 ఏళ్ల ఆనందీబెన్ పటేల్ గుజరాత్ ముఖ్యమంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. ఆ తరువాత పార్టీ నిర్ణయానికి తలొగ్గిన అమె తన పదవిని తృణప్రాయంగా వదిలేశారు. కాగా అమెను గవర్నర్ పదవికి సిఫార్సు చేయాలని రాష్ట్ర బీజేపి భావించింది.

ఇదే విషయాన్ని రాష్ట్ర న్యాయకత్వం జాతీయ స్థాయిలోని నేతలకు విన్నవించగా, వారు సరేనంటూ సుమారు ఏడాదిన్నర కాలంగా నిరీక్షింప చేసిన తరువాత తాజగా ఉత్తర్వులు జారీ చేశారు. కాగా మధ్యప్రదేశ్ గవర్నర్ రామ్ నరేష్ యాదవ్ పదవీకాలం ముగియడంతో గుజరాత్ గవర్నర్ ఓపీ కోహ్లీ ప్రస్తుతం మధ్యప్రదేశ్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇప్పుడు ఆయన నుంచి  ఆనందీబెన్ పటేల్ బాధ్యతలు స్వీకరించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Anandiben Patel  Madhya Pradesh  Madhya Pradesh governor  BJP  Amit Shah  Gujarat  

Other Articles