Venkaiah Naidu Left Barefoot after someone made off with his shoes పాపం వెంకయ్య.. మొన్న డబ్బు.. ఇవాళ పాదరక్షలు..

Venkaiah naidu left barefoot after someone made off with his shoes

bengaluru, Bharatiya Janata Party, BJP, venkaiah naidu, sadananda gowda, jagadish shettar, bengaluru, karnataka

Vice President Venkaiah Naidu found himself in a rather embarrassing spot when his footwear went missing from the residence of a BJP MP while he was attending a breakfast meeting.

పాపం వెంకయ్య.. మొన్న డబ్బు.. ఇవాళ పాదరక్షలు..

Posted: 01/19/2018 07:57 PM IST
Venkaiah naidu left barefoot after someone made off with his shoes

గుడికో, వేడుక‌కో వెళ్లిన‌ప్పుడు చెప్పులు పోతే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అయితే చెప్పులు పోతే.. మాత్రం మంచిదని కూడా మన పెద్దవాళ్లు చెబుతుంటారు. ఇలా అని ఎవరి విషయంలోనైనా సర్దుకుపోవచ్చునేమోకానీ, ఏకంగా దేశానికి చెందిన ప్రముఖుల విషయంలో మాత్రం సర్థుకుపోలేము. అయితే ఇదే అనుభవమే ఎదురైంది మన ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంకయ్యనాయుడుకి. అంతటి పెద్దవారికి కూడా కొద్దిసేపు చెప్పులు లేకుండా వట్టికాళ్లతో నిలబడాల్సిన ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది.

ఇటీవలే ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన వెంకయ్యనాయుడు విషయంలో ఆయనకు ఇలాంటి అనుభవం ఎదురుకావడం రెండవ పర్యాయం. ఇటీవలే అమెరికా కేంద్రంగా ఏర్పాటు చేసిన నకిలీ కంపెనీ ప్రచారప్రకటనలు చూసి కొంత డబ్బును వెచ్చించిన తరువాత వారు మళ్లీ డబ్బు అగడంతో అనుమానం వచ్చి.. నిమ్మకుండిపోయిన వెంకయ్య తన డబ్బును మాత్రం పోగొట్టుకోలేక తప్పలేదు. తాజాగా ఆయన తన పాదరక్షలు కూడా పోగొట్టుకున్నాడు.

కొన్ని అధికారిక వేడుక‌ల‌కు హాజ‌రుకావ‌డానికి వెంక‌య్య‌నాయుడు బెంగ‌ళూరు విచ్చేశారు. అందులో భాగంగా స‌న్నిహితులు, ఇత‌ర కేంద్ర‌ మంత్రులు సదానంద గౌడ‌, అనంత్ కుమార్‌ లతో కలసి ఎంపీ పీసీ మోహ‌న్ ఇంట్లో స‌మావేశ‌మ‌య్యారు. స‌మావేశం పూర్తై బ‌య‌టికొచ్చి చూసేస‌రికి ఆయ‌న షూస్ క‌నిపించ‌లేదు. దీంతో వ‌ట్టి కాళ్ల‌తోనే కాసేపు అటూ ఇటూ తిరగాల్సి వ‌చ్చింది. ఆయ‌న ర‌క్ష‌ణ సిబ్బంది ఎంపీ ఇంట్లో, ఆవ‌ర‌ణ‌లో ప్ర‌తి అంగుళం వెతికిన‌ప్ప‌టికీ లాభం లేకుండా పోయింది. పొర‌పాటున ఎవ‌రైనా వేసుకుని వెళ్లి ఉంటార‌ని భావించి, ఇక చేసేది లేక ద‌గ్గ‌ర‌లోని షోరూంకు వెళ్లి కొత్త షూస్ కొనుక్కుని వ‌చ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles