EC recommends disqualification of 20 AAP MLAs అమ్ అద్మీ పార్టీైకి ఈసీ భారీ దెబ్బ

Ec recommends disqualification of 20 aap mlas

aap, arvind kejriwal, aam aadmi party, aap mla disqualification, election commission of india, office of profit, 20 aap mlas, election commission, delhi hc, ram nath kovind, aap mla disqualification, delhi government

The Election Commission of India recommended disqualification of 20 Aam Aadmi Party (AAP) MLAs after it found each one of them guilty of holding ‘Office of Profit’.

అమ్ అద్మీ పార్టీైకి ఈసీ భారీ దెబ్బ.. ఎమ్మెల్యేలపై వేటు..

Posted: 01/19/2018 07:12 PM IST
Ec recommends disqualification of 20 aap mlas

ఆమ్ ఆద్మీ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం భారీ షాక్ ఇచ్చింది. అప్ పార్టీతో పాటు ఆ పార్టీ అధినేత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు కూడా సీఈసీ దిమ్మదిరిగి మైండ్ బ్లాక్ అయ్యేలా షాక్ ఇచ్చింది. అమ్ ఆద్మీకి చెందిన చెందిన 20 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటును వేసిన కేంద్రం ఎన్నికల సంఘం ఢిల్లీ సర్కారు ఊహించని విధంగా షాక్ ఇచ్చింది.

అంతటితో అగని కేంద్ర ఎన్నికల సంఘం ఆప్ పార్టీకి చెందిన అనర్హ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కూడా కోరింది. వీరిని అనర్హులుగా ప్రకటించాలంటూ రాష్ట్రపతికి సిఫారసు చేసింది. వీరంతా పార్లమెంటు సెక్రటరీలుగా లాభదాయక పదవుల్లో కొనసాగుతున్నారని తెలిపింది.

ఒకవేళ ఈ 20 మందిని రాష్ట్రపతి అనర్హులుగా ప్రకటిస్తే... ఈ స్థానాలకు ఉపఎన్నిక జరుగుతుంది. 70 మంది ఎమ్మెల్యేలు ఉండే ఢిల్లీ అసెంబ్లీలో 66 మంది ఆప్ కు చెందినవారే ఉన్నారు. దీంతో వీరిపై అనర్హత వేటు పడ్డా కేజ్రీ ప్రభుత్వానికి వచ్చిన ఢోకా ఏమీ లేదు. కాకపోతే, పార్టీకి మాత్రం పెద్ద దెబ్బ తగిలినట్టే. 2015లో ఆప్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 21మందిని పార్లమెంటు సెక్రటరీలుగా కేజ్రీవాల్ నియమించారు. మరోవైపు ఈసీ నిర్ణయంపై సుప్రీంకోర్టును ఆప్ ఆశ్రయించనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles