Top BJP leaders on JeM's target list బీజేపి అగ్రనేతలే టార్గెట్.. దేశంలోకి వచ్చిన ఉగ్రవాదులు

Jaish setting up special squad to target top bjp leaders intel

talha rasheed, Lashkar-e-Taiba, kashmir jaish, jaish squad, jaish bjp, Jaish-e-Mohammed, Maulana Masood Azhar, Intelligence bureau

Intelligence agencies are scrambling to verify an input that Jaish-e-Mohammed chief Maulana Masood Azhar is setting up a special squad to target prominent politicians including senior cabinet ministers and a high-profile chief minister.

బీజేపి అగ్రనేతలే టార్గెట్.. దేశంలోకి వచ్చిన ఉగ్రవాదులు

Posted: 11/22/2017 10:26 AM IST
Jaish setting up special squad to target top bjp leaders intel

బీజేపీ అగ్రనేతలు, సీనియర్ నేతలు, ప్రముఖ ముఖ్యమంత్రులను ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు టార్గెట్ చేశారన్న ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరికలు వెలువడిన రెండు రోజులకు మరో మారో ఐబీ అధికారుల నుంచి తాజాగా హెచ్చరికలు జారీ అయ్యాచి. పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు జైషే మహ్మద్, లష్కరే తోయిబా బీజేపి అగ్రనేతలను, సీనియర్ నేతలను టార్గెట్ చేశాయని స్పష్టం చేశాయి. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో బీజేపి నేతలు అప్రమత్తంగా వ్యవహరించాలని కూడా ఇంటెలిజెన్స్ హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే.

అయితే తాజాగా పాక్ ఉగ్రసంస్థలు కూడా బీజేపి అగ్రనేతలు, బీజేపి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులను టార్గెట్ చేశాయన్న హెచ్చరికల నేపథ్యంలో ఆయా నేతలకు భద్రతను కూడా కట్టుదిట్టం చేశారు. బీజేపి నేతల హత్యలకు కుట్ర వెనుక జైషే మహ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజార్ ఉన్నాడని ఇంటెలిజెన్స్ అధికారులు పేర్కొన్నారు. ఈ ఆపరేషన్ కు సంబంధించి ఇప్పటికే కొందరు ఉగ్రవాదులు భారత్ లోకి ప్రవేశించారు. తొలి టార్గెట్ గా వీరు ఓ ప్రముఖ బీజేపీ ముఖ్యమంత్రిని ఎంచుకున్నట్టు సమాచారం. ఈ ముఖ్యమంత్రి తక్కువ భద్రతతో తిరుగుతుంటారట.

ఈ నేపథ్యంలో, బంగ్లాదేశ్ అధికారుల సహాయంతో ఢాకాలోని ఓ అనుమానిత ప్రదేశంపై మన ఇంటెలిజెన్స్ అధికారులు రైడ్ చేశారు. అయితే, అక్కడ ఎలాంటి సమాచారం దొరకలేదని ఓ అధికారి తెలిపారు. మసూద్ అజార్ మేనల్లుడు తహ్లా రషీద్ కాల్చివేతకు ప్రతీకారంగానే ఈ ఆపరేషన్ చేపట్టారనే సమాచారం ఉందని అధికారులు తెలిపారు. దీంతో అటు కేంద్రంతో పాటు ఇటు రాష్ట్ర పోలీసులు విభాగాలు కూడా బీజేపి అగ్రనేతలకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేశాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles